Ram Gopal Varma:రామ్ గోపాల్ ..శివ తో సెన్సేషన్ క్రియేట్ చేసి సర్కార్ ,రక్త చరిత్ర, కంపెనీ సినిమాలతో ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్ తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి ముఖ్యంగా 64 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్, హెల్త్ ఎలా మెయింటేన్ చేస్తున్నాడు అనే విషయాలపై ఒక ఇంటర్వ్యూలో ఆసక్తి కరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
వర్మ మాట్లాడుతూ తన లంచ్ బాక్స్‌లో ఏముంటుందో తనకి కూడా తెలీదని, ఏది పెడితే అది తింటానని సింపుల్‌గా చెప్పేశారు. బయట హోటల్‌లో తిన్నప్పుడు మాత్రం నూనె, వెన్న ఎక్కువగా ఉన్నా, తనకు నచ్చని ఐటమ్స్ కనిపించినా వెంటనే పక్కన పెట్టేస్తానని తెలిపారు.ఇక ప్లేట్‌లో ఉల్లిపాయలు, సలాడ్ లాంటివి పెట్టినా, మనసుకు నచ్చని వాటిని బలవంతంగా తినే అలవాటు లేదని స్పష్టం చేశారు.ఇలాగే తన డైట్ ఉంటుందని వివరించారు.
ఇక కోపం గురించి వర్మ మాట్లాడుతూ మనకు ఏదైనా అన్యాయం జరిగితే సహజంగానే కోపం వస్తుందని కానీ వర్మ మాత్రం మనమే కరెక్ట్ అని గట్టిగా అనుకోవడం వల్లే కోపం వస్తుందని చెప్పుకొచ్చారు.ఎదుటివాళ్ల ఆలోచనలు, వాళ్ల పరిస్థితులు ఏంటో పూర్తిగా అర్థం చేసుకోకుండా, మనమే రైట్ అని ఎలా ఫిక్స్ అయిపోతామని ప్రశ్నించారు.
అలాగే అవసరానికి తగ్గట్టుగా కోపంగా నటించడం వేరు, నిజంగా లోపలి నుంచి కోపం తెచ్చుకోవడం వేరు అని చెప్పారు. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోయి కోపం తెచ్చుకోవడం తెలివైన పని కాదని తన మనసులోని మాటని బయటపెట్టారు.
ఇక తన సినిమాల్లోని క్యారెక్టర్ల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు తన సినిమాల్లో హీరో, విలన్ మధ్య డిఫరెన్స్ చాలా స్పష్టంగా ఉండేదని, ఉదాహరణకు ‘శివ’ సినిమాలో నాగార్జున క్యారెక్టర్, జేడీ క్యారెక్టర్ చూస్తే ఆ తేడా ఈజీగా అర్థమవుతుందని అన్నారు. కానీ ఇపుడు అలా లేదని మనుషుల్లో మంచి చెడు రెండూ ఉంటాయని, ఎవరినీ పూర్తిగా మంచివాళ్లని లేదా చెడ్డవాళ్లని చెప్పలేమని వివరించారు.
ఇక సక్సెస్ సాధించాలంటే కేవలం టాలెంట్ ఒక్కటే సరిపోదని ‘ది ఫౌంటెన్‌హెడ్’ నవలలోని హోవార్డ్ రోర్క్, పీటర్ కీటింగ్ పాత్రలను ఎగ్జాంపుల్ గా చెప్పుకొచ్చారు. తనలో రోర్క్ లాంటి థాట్ ప్రాసెస్ ఉన్న బయట బతికేటప్పుడు పీటర్ కీటింగ్ లాంటి ప్రాక్టికల్ థాట్ ప్రాసెస్ ఉండాలని అన్నారు. మనకు ఎంత టాలెంట్ ఉన్నా, మనం చెప్పాలనుకున్నది ఎదుటివాళ్లకు అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యమని వివరించాడు.
తన కెరీర్ మొదట్లో వీడియో లైబ్రరీ నడిపిన రోజులను గుర్తుచేసుకుంటూ మంచి బిజినెస్ వదిలేసి సినిమాల వైపు వస్తున్నప్పుడు సినిమా పూర్తవుతుందా లేదా, రిలీజ్ అవుతుందా లేదా, జనాలు చూస్తారా లేదా అనే బోలెడు డౌట్స్ ఉండేవని తెలిపారు.అయినా తన ఆలోచనల మీద నమ్మకంతో ముందుకు వెళ్లానని . ‘శివ’ సినిమాతో వచ్చిన సక్సెస్ తనకు పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టిందని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం ఏం చెప్తున్నాం అన్నదానికంటే, వాళ్లు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ఆలోచించాలని మన టార్గెట్చేరుకోవాలంటే సిట్యుయేషన్‌కు తగ్గట్టుగా నడుచుకోవాలని, అందరినీ కలుపుకుని వెళ్లే విషయంలో శ్రీకృష్ణుడి స్ట్రాటజీని ఫాలోకావాలని హిత బోధ చేసుకొచ్చాడు ఈ వెటరన్ స్టార్ ఫిలిమ్ మేకర్ !
ALSO READ:‘రామాయణ’ బాక్సాఫీస్ జాతర.. హిందీ వెర్షన్‌లో రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధ్యమయ్యేనా?