E-Paper
Advertisement

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్.. ఇండియాలో దుమ్మురేపుతున్న 5 బడ్జెట్ బైక్‌లు!

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్.. ఇండియాలో దుమ్మురేపుతున్న 5 బడ్జెట్ బైక్‌లు!
Advertisement

5 Best Mileage Bikes: కొత్త బైక్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ తక్కువగా ఉందా? డోంట్ వర్రీ.. ఎక్కువ డబ్బులు పెట్టకుండానే మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా రోజూ ఆఫీసులకు వెళ్లేవారు, చిన్న చిన్న పనుల కోసం ప్రయాణించేవారు తక్కువ ధరలో లభించే కమ్యూటర్ బైక్‌లను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, మంచి ఫ్యూయల్ సామర్థ్యం, సరసమైన ధరతో.. ప్రస్తుతం దేశీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఐదు మంచి బడ్జెట్ బైక్‌ల గురించి తెలుసుకుందాం.

1.హీరో HF డీలక్స్

తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌ అనగానే గుర్తొచ్చేది హీరో HF డీలక్స్. ఈ బైక్ సుమారు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్‌ షోరూమ్ ధర సుమారు రూ.58,671 నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో పాటు రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

2.టీవీఎస్ స్పోర్ట్

Advertisement

మైలేజ్ విషయంలో టీవీఎస్ స్పోర్ట్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర సుమారు రూ.65,707 నుంచి ఉంటుంది. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

3.హోండా షైన్ 100

హోండాలో మంచి మైలేజ్ కోరుకునేవారికి షైన్ 100 మంచి ఆప్షన్. ఇందులో 98.98cc ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ సుమారు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.65,970. స్మూత్ రైడింగ్, సింపుల్ డిజైన్‌తో రోజువారీ అవసరాలకు సరిపోతుంది.

4.బజాజ్ ప్లాటినా 100

Advertisement

ఎక్కువ మైలేజ్‌తో పాటు ప్రయాణంలో మంచి సౌకర్యం కావాలనుకునేవారు బజాజ్ ప్లాటినా 100ను తీసుకోవచ్చు. ఈ బైక్ సుమారు 75 కి.మీ మైలేజ్ అందిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.71,033. రోజువారీ ప్రయాణాలు, ఎక్కువ దూరం వెళ్లేవారికి ఈ బైక్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

5.హీరో స్ప్లెండర్ ప్లస్

ఇండియన్ మార్కెట్‌లో అత్యంత ఆదరణ కలిగిన బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ బైక్ సుమారు 63 కి.మీ  మైలేజ్ ఇస్తుంది. దీని ఆన్‌రోడ్ ధర సుమారు రూ.95,058 నుంచి రూ.98,228 వరకు ఉంటుంది. మంచి రీసేల్ వ్యాల్యూ, నమ్మకం, మంచి సర్వీస్ నెట్‌ వర్క్ తో ఆకట్టుకుంటుంది.

Read Also: డిసెంబర్‌లో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? రూ. 1 లక్ష లోపు లభించే బెస్ట్ మోడళ్లు ఇవే!

Tags

Related News

డిసెంబర్‌లో కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? రూ. 1 లక్ష లోపు లభించే బెస్ట్ మోడళ్లు ఇవే!

టూవీలర్ మార్కెట్లోకి చైనా దిగ్గజం చెరీ.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు రెడీ!

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో హీరో సత్తా.. ఏకంగా ఓలాను దాటేసిందిగా!

హ్యుందాయ్ నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి ఎలక్ట్రిక్, మరొకటి హైబ్రిడ్!

పండుగ సీజన్‌ లో లక్ష దాటిన ట్రాక్టర్ల అమ్మకాలు.. ఏ కంపెనీ ఎన్ని యూనిట్లు అమ్మిందంటే?

ఆంపియర్ నుంచి కొత్త EV.. 3 నెలల్లో ఐస్‌బ్రేకర్ లాంచ్!

థార్ రాక్స్ To ఫార్చ్యూనర్.. లాంగ్ జర్నీలకు బెస్ట్ డీజిల్ SUVలు!

Big Stories

Advertisement
×