Contra Flow: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు కూకట్‌పల్లి, KPHB, JNTU వైపు నుంచి హైటెక్ సిటీ, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు ప్రయాణిస్తుంటారు. ఉదయం ఆఫీస్ టైమ్‌లో సాయంత్రం ఆఫీస్ అవర్స్‌లో ఈ రూట్‌లో ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. రోడ్డుపై కార్లు, బైకులు, క్యాబ్‌లు మాత్రమే కాదు. బస్సులు కూడా అదే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. అంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతోందన్నమాట.
ఇక్కడే సైబరాబాద్ పోలీసులు కొత్త ఆలోచన చేశారు. సాధారణంగా రోడ్డుపై ఉన్న అన్ని వాహనాలు ఒకే దిశలో వెళ్తుంటాయి. కానీ.. పీక్ అవర్‌లో బస్సులకు మాత్రం రాంగ్ రూట్‌లో ప్రత్యేకంగా లైన్ కేటాయిస్తారు. దీనినే కాంట్రా-ఫ్లో అంటారు. అంటే ఇది బస్సులు ఇష్టానుసారం రాంగ్‌రూట్‌లో వెళ్లడం కాదు. ట్రాఫిక్ పోలీసుల నియంత్రణలో ప్రత్యేక లేన్‌లో బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కాంట్రా-ఫ్లో విధానంపై అధికారులు ముందుగానే ట్రాఫిక్ స్టడీలు చేశారు. JNTU–హైటెక్ సిటీ–రాయదుర్గం వైపు దాదాపు 7 కిలోమీటర్ల పైలట్ కారిడార్ ప్రతిపాదించారు. ఇందులో బస్సులు ఎక్కడ ప్రత్యేక లేన్‌లోకి వస్తాయి..? ఎక్కడ బయటకు వస్తాయి..? ఎక్కడ మళ్లీ సాధారణ ట్రాఫిక్‌లో కలుస్తాయి..? అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఈ కాంట్రా-ఫ్లోలో బస్సులు ఇతర వాహనాలతో కన్‌ఫ్లిక్ట్ కాకుండా చూసే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ చాలా కీలకం. అందుకే లేన్ మార్కింగ్, ట్రాఫిక్ కంట్రోల్, బస్సుల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. బస్సులో వెళ్లే ఐటీ ఉద్యోగులకు ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉండొచ్చు. మొదటిది ప్రయాణ సమయం తగ్గే అవకాశం. రెండోది పీక్ అవర్‌లో బస్సు సర్వీసులు మరింత నమ్మకంగా నడిచే అవకాశం. మూడోది కార్లు, బైకుల బదులు ఎక్కువ మంది బస్సుల్లోకి మారితే రోడ్డుపై ప్రైవేట్ వాహనాల సంఖ్య కూడా తగ్గే అవకాశం.
Also Read: మరో మైలురాయిని దాటుతున్న తెలంగాణ.. అదేంటో తెలుసా..?