E-Paper
Advertisement

‘రామాయణ’ బాక్సాఫీస్ జాతర.. హిందీ వెర్షన్‌లో రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధ్యమయ్యేనా?

‘రామాయణ’ బాక్సాఫీస్ జాతర.. హిందీ వెర్షన్‌లో రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధ్యమయ్యేనా?
Advertisement

Ramayana Box Office:‘రామాయణ’..రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీష్ తివారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తుందో వస్తున్న కలెక్షన్స్ చెబుతున్నాయి.ఇక ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో సునామి స్ప్రుష్టిస్తున్న ఈ సినిమా ఇప్పుడు హిందీ మార్కెట్‌లో మరో రికార్డ్ కి దగ్గరలో ఉంది.అవును..ఇప్పటికి కేవలం హిందీ వెర్షన్ ద్వారా ఇండియాలో రూ.800 కోట్ల నెట్ కొల్లగొట్టిన ఈ సినిమా వెయ్యి కోట్లకి రెండు వందల కోట్ల దూరంలో నిలబడింది.

నిజానికి కేవలం హిందీలోనే రూ.800 కోట్లు కొల్లగొట్టడం అంత ఆషామాషీ కాదు.అలాంటిది ఇపుడు మరో రూ.200 కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. నిజం చెప్పాలంటే రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు వెళ్లడం అంత ఈజ కాదు.

Advertisement

ఎందుకంటే సినిమా థియేటర్ లోకి వచ్చినప్పుడు ఉండే ఆక్యుపెన్సీ ,బజ్, కలెక్షన్స్ ఇపుడు ఉండవు.ఇప్పుడు గనుక మిగిలిన ఆ రెండు వందల కోట్లు రాబట్టాలంటే మాత్రం సినిమా మునుపటిలా వసూళ్ళ వర్షం కురిపించాలి.నిజంగా మరో రెండు వందల కోట్లు కొల్లగొట్టాలి అంటే మిరాకిలే జరగాలి.

అయితే ‘రామాయణ’కు ఫ్యామిలీ ఆడియన్స్, పౌరాణిక కథలు ఇష్టపడే వాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వీకెండ్స్‌లో ఇలాగే మంచి వసూళ్లు వస్తూ ఉంటే వెయ్యి కోట్లకి దగ్గరగా వెళ్ళవచ్చు అన్నది మేకర్స్ ప్లాన్.

Advertisement

నిజానికిఈ సినిమా ఇంత పెద్ద రేంజ్‌లో హిట్ కావడానికి స్టార్ క్యాస్టింగ్ ఒక కారణం అని చెప్పాలి.. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఎలా ఉంటారా అని మొదటి నుంచే ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఉంది. దానికి తోడు యష్ విలన్ పాత్రలో కనిపించడం, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ లాంటి వాళ్లు ఉండటంతో సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక దంగల్ తీసిన డైరెక్టర్ నితీష్ తివారి దర్శకుడిగా ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో ఎక్కడ లేని బజ్ వచ్చేసింది.

ఇక మ్యూజిక్ విషయానికి వస్తే హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి పనిచేయడం ఈ సినిమాకు ఇంకో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా అయితే సినిమాకి డబ్బులు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టారని తెరపై కనిపిస్తున్న ప్రొడక్షన్ వాల్యూసే చెబుతున్నాయి.

అయితే అసలు విషయానికి వస్తే ఇప్పటికే బాహుబలి 2’, ‘దంగల్’, ‘పుష్ప 2’ లాంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ రేంజ్‌ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. కానీ ఏ సినిమా కూడా నార్త్ బెల్ట్ లో 1000 కోట్లని టచ్ చేయలేకపోయింది.

మరి మొత్తానికి హిందీలో రూ.800 కోట్లకు దగ్గరైన ‘రామాయణ’ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే ఊపు ఇలాగే కొనసాగితే వెయ్యి కోట్లని టచ్ చేయొచ్చు.కాని థియేటర్ వైపు పడుతున్న ఫుట్ ఫాల్స్ పైనే అది డిపెండ్ అయి ఉంది.చూడాలి మరి రామాయణ సంచలనం స్ప్రుష్టిస్తుందా ,లేక చల్లగా సైడ్ అవుతుందా !

ALSO READ:ప్రీతి అందాల జాతర మామూలుగా లేదుగా.. చూపు తిప్పుకోవడం కష్టమే!

Tags

Related News

64 ఏళ్ల వయసులోనూ వర్మ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా?

డిసెంబర్ రెండో వారమే డెడ్‌లైన్.. అట్లీ ముందున్న అసలు సవాల్ ఇదే!

మెగా ఇంటికి ‘ఆకాశంలో ఒక తార’ టీం.. చిరు చరణ్ ప్రత్యేక అభినందనలు..

ప్రీతి అందాల జాతర మామూలుగా లేదుగా.. చూపు తిప్పుకోవడం కష్టమే!

హనుమాన్ 2 రైట్స్ వివాదంపై నిర్మాత క్లారిటీ.. రూ.23 కోట్ల సెటిల్మెంట్ వార్తల్లో నిజమెంత?

అమెరికా వెళ్లినా పెరుగు అన్నం కావాల్సిందే.. భార్య గురించి సీక్రెట్స్ బయటపెట్టిన రాజశేఖర్!

టాలీవుడ్ హీరోలపై ‘అలియాస్ రుక్మిణి’ బ్యూటీ కామెంట్స్!

Big Stories

Advertisement
×