OTT Movie : హాలీవుడ్ సినిమాలలో థ్రిల్లర్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ జానర్ స్టోరీలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ జానర్ లో హాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎం. నైట్ శ్యామలన్ ఒక భయంకరమైన హారర్ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించాడు. ఈ స్టోరీ 19వ శతాబ్దంలో ఒక అడవి ప్రాంతంలో ఉండే గ్రామంలో జరుగుతుంది. ఈ సినిమాలో మూవీ లవర్స్ కి కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది అనే వివరాల్లోకి వెళితే ..
కథలోకి వెళ్తే
19వ శతాబ్దంలో పెన్సిల్వేనియాలోని కోవింగ్టన్ అనే ఒక చిన్న గ్రామం దట్టమైన అడవిలో ఉంటుంది. గ్రామస్తులు వ్యవసాయ జీవనం గడుపుతూ, కఠినమైన నియమాలను పాటిస్తుంటారు. అడవిలో నివసించే వింతగా ఉండే భయంకరమైన జీవుల గురించి భయపడుతుంటారు. గ్రామస్తులు అడవిలోకి వెళ్ళకపోతే, ఆ జీవులు వాళ్ళని ఏమీ చేయవు. ఇది ఒక ఒప్పందంలో భాగంగా జరుగుతుంది. ఈ కథ లూసియస్ హంట్ అనే ఒక డేరింగ్ యువకుడితో మొదలవుతుంది. అతను గ్రామ నిబంధనలను ప్రశ్నిస్తాడు. రోగులకు సహాయం చేయడానికి సిటీ నుండి మందులు తెచ్చేందుకు అడవిలోకి వెళ్లాలనుకుంటాడు.ఎడ్వర్డ్ వాకర్ అనే గ్రామ పెద్ద దీనికి ఒప్పుకోడు. అతనితో పాటు మిగతా పెద్దలు కూడా అడ్డుపడతారు. అడవిలోకి వెళ్తే, ఈ జీవులు ప్రమాదాన్ని భయంకరంగా తీసుకొస్తాయని వాదిస్తారు.
మరోవైపు లూసియస్, ఐవీ వాకర్ అనే ఒక కంటి చూపు లేని అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. కానీ ఆమెకు చూపు లేకపోయినా తెలివి తేటలు బాగా ఉంటాయి. ఇంతలో ఒక్కసారిగా గ్రామంలో వింత సంఘటనలు జరుగుతాయి. జంతువుల చర్మం ఒలిచినట్లు కనిపిస్తుంది, తలుపులపై ఎరుపు గుర్తులు కనిపిస్తాయి. ఈ భయంకరమైన వింత జీవులు గ్రామ సరిహద్దులను దాటి లోపలి వచ్చే సూచనలు కనిపిస్తాయి. ఈ గ్రామాన్ని రక్షించాలనే ఆలోచనతో లూసియస్ కూడా అడవిలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమయంలో స్టోరీ ఊహించని సంఘటనలతో గుండె దఢను మరింత పెంచుతుంది. లూసియస్ అడవిలోకి వెళ్తాడా ? ఆవింత జీవులు గ్రామస్తులను ఏమైనా చేస్తాయా ? లూసియస్ లవ్ స్టోరీ ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని చూడాల్సిందే.
మూడు ఓటీటీలలో
‘ది విలేజ్’ (The Village) ఎం. నైట్ శ్యామలన్ దర్శకత్వంలో తెరకెక్కిన అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా లూసియస్ హంట్, ఐవీ వాకర్ వంటి పాత్రల చుట్టూ తిరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ లో ఇది అందుబాటులో ఉంది. ఈ చిత్రం ఆస్కార్ రేస్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కి పోటీపడింది. అలాగే Saturn Awardsలో “బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్” కేటగిరీలో పోటీపడింది. IMDbలో ఈ సినిమా 6.6/10 రేటింగ్ పొందింది.
Read Also : అందరి ముందే ఆ పని… మనవరాలికి యాంగిల్స్ గురించి నూరి పోసే బామ్మ… ఈ బ్లాక్ కామెడీ ప్యూర్ గా పెద్దలకు మాత్రమే