BigTV English

Selfie Deaths: అత్యధిక సెల్ఫీ మరణాలు ఈ దేశాల్లోనే.‌. వామ్మో ఇండియా ఆస్థానంలో ఉందా?

Selfie Deaths: అత్యధిక సెల్ఫీ మరణాలు ఈ దేశాల్లోనే.‌. వామ్మో ఇండియా ఆస్థానంలో ఉందా?

Deadliest Countries For Selfies: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా తమ మూమ్ మెంట్స్ ను ఫోన్లలో బంధిస్తున్నారు. ఇక టూరిస్ట్ స్పాట్ లకు వెళ్లినప్పుడు లెక్కలేనని ఫోటోలు తీసుకుంటారు. అయితే, సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జలపాతాలు, నదీ ప్రవాహాలు, ఎత్తైన కొండలు, లోయల సమీపంలో ఫోటోలు తీసుకుంటూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. తాజాగా సెల్ఫీ తీసుకుంటూ చనిపోయిన వారి గురించి ‘ది బార్బర్ లా ఫర్మ్’ అనే సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. సెల్ఫీ తీసుకుంటూ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన టాప్ 5 దేశాల లిస్టును విడుదల చేసింది. ఇందులో ఇండియా ఏ ప్లేస్ లో ఉందంటే..


సెల్ఫీలు తీసుకుంటూ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన టాప్ దేశాలు

⦿ ఇండియా-ర్యాంక్ 1:


సెల్ఫీలు తీసుకుంటూ ఎక్కువ మంది చనిపోయే దేశాల్లో ఇండియా తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాదిలో 271 సెల్ఫీ ఘటనలు జరిగినట్లు ‘ది బార్బర్ లా ఫర్మ్’ నివేదిక వెల్లడించింది. ఇందులో 214 మంది చనిపోగా, 57 మంది గాయపడ్డారు.  ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ సంబంధిత ప్రమాదాల్లో ఇండియా 42.1 శాతం ఘటనలో టాప్ లో నిలిచింది. రద్దీగా ఉండే పర్యాటక ప్రదేశాలు, కొండలు,  రైలు పట్టాలపై సెల్ఫీలు తీసుకుంటూ ఎక్కువ మంది ప్రమాదానికి గురైనట్లు వివరించింది.

⦿ అమెరికా – ర్యాంక్ 2: సెల్ఫీ సంబంధిత ప్రమాదాల్లో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. అమెరికాలో మొత్తం 45 ఘటనలు జరిగాయి. ఇందులో 37 మంది చనిపోగా, 8 మంది గాయపడ్డారు. జలపాతాలు, పైకప్పులు, రహదారుల దగ్గర ప్రమాదకర సెల్ఫీలు దిగుతూ ప్రమాదానికి గురైనట్లు నివేదిక వెల్లడించింది.

⦿ రష్యా – ర్యాంక్ 3: రష్యాలో మొత్తం 19 సెల్ఫీ సంబంధ ఘటనలు జరిగాయి. ఇందులో 18 మంది చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మంచుతో నిండిన ప్రకృతి దృశ్యాలు, వంతెనలు, ఆకాశహర్మ్యాల దగ్గర సెల్ఫీలు దిగుతూ పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక వివరించింది.

⦿ పాకిస్తాన్ – ర్యాంక్ 4: దాయాది దేశం పాకిస్తాన్ లోనూ సెల్పీ సంబంధ ఘటనలు 16 జరిగాయి. వీటిలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. తక్కువ పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ లో అధిక సంఖ్యలో సెల్ఫీ ప్రమాదాలు జరిగాయి.

Read Also: లోకల్ ట్రైన్ లో ప్రేమ జంట ముద్దులాట.. అందరి ముందు ఏంటా పని?

⦿ ఆస్ట్రేలియా – ర్యాంక్ 5: ఆస్త్రేలియాలో సెల్ఫీ సంబంధ ప్రమాదాలు 15 జరిగాయి. ఇందులో 13 మంది చనిపోగా, ఇద్దరు గాయపడ్డారు. అవుట్‌ బ్యాక్ కొండలు, తీరప్రాంత అంచుల్లో ఎక్కువగా ఈ తరహా ప్రమాదాలు జరిగాయి.

Read Also: పొంగిపొర్లే నదిలో డేంజర్ స్టంట్, వరద ధాటికి జీప్ పల్టీ, సీన్ కట్ చేస్తే..

Related News

TTD updates: తిరుమల ఆలయం తలుపులు మూసివేత.. భక్తులు గమనించండి!

Viral News: కిలో మీటర్ ఆటో జర్నీ.. రూ. 425 ఛార్జీ.. మరీ ఇంత దోపిడీనా గురూ!

Viral News: లోకల్ ట్రైన్ లో ప్రేమ జంట ముద్దులాట.. అందరి ముందు ఏంటా పని?

Indian Railways: నో వాటర్, డర్టీ టాయిలెట్స్, బాబోయ్ రైళ్లలో శుభ్రత ఇంత దారుణమా?

Train Tickets: రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం బంద్.. అసలు విషయం చెప్పిన కేంద్రం!

Big Stories

×