Ram Pothineni: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో రామ్ పోతినేని ఒకరు. దేవదాస్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ పోతినేని. సంక్రాంతి కానుకగా అప్పట్లో విడుదలైన ఈ సినిమా ఒక సెన్సేషన్. ఈ సినిమా ఇమీడియట్ గా సక్సెస్ కాలేదు. కానీ మౌత్ టాక్ ద్వారా రెండు మూడు వారాలు తర్వాత మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక్కడితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు రామ్.
ఇప్పుడు రామ్ కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బాక్సాఫీస్ వద్ద రీసెంట్ టైమ్స్ లో రామ్ చేస్తున్న సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఆ స్థాయిలో ఇప్పటివరకు రామ్ సక్సెస్ కొట్టలేదు. ఇక ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు రామ్. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ నటిస్తుంది. అయితే రామ్ తనతో ప్రేమలో ఉన్నాడు అని వార్తలు వస్తున్నాయి.
రామ్ భాగ్యశ్రీ తో లవ్ లో ఉన్నాడు అని పలు రకాల కథనాలు వినిపించాయి. కానీ దీని గురించి ఇప్పటివరకు ఒక క్లారిటీ కూడా రాలేదు. అయితే వీరి ఇరువురి ఇంస్టాగ్రామ్ పోస్టులు చూస్తుంటే కొంతమేరకు నిజమేమో అనిపిస్తుంది. ఇక ఫస్ట్ టైం రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో ఒక పాటను రాశాడు. ఒక ప్రొఫెషనల్ సాహిత్య రచయిత పాటను ఎలా రాస్తాడో అచ్చం అలానే రాశాడు రామ్. సాహిత్య రచయితగా రామ్ కి కూడా ఈ పాట మంచి పేరుని తీసుకొచ్చాను.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం రామ్ పోతినేని పాటను రాశాడు. ఇప్పుడు మరోసారి పాటను పాడబోతున్నాడు. గతంలో రామ్ పాట పాడిన దాఖలాలు చాలా తక్కువ. అయితే ఈ సినిమా కోసం మొదటి పాటను రాయడం, రెండవ పాటను పాడటం చాలామంది కొత్తగా అనిపిస్తుంది. బహుశా ప్రేమలో పడటం వలన ఈ కొత్త కొత్త పనులు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ పోలిశెట్టి కూడా ఒక పాటను పాడారు. మళ్లీ తన మూడవ సినిమాలో తన హీరోతోనే మరో పాటను పాటించడానికి డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. ఈ పాటకు సంబంధించిన అధికారిక అప్డేట్ మైత్రి మూవీ మేకర్ అందించారు. అలానే భాగ్యశ్రీ వీడియో బయటకు ఈ పాటను అనౌన్స్ చేశారు.
Also Read : Little Hearts: మీ హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డ్ ఉందా? జోక్ నిజం అయిపోయింది