Ram Pothineni: తెలుగు చదవలేని హీరోలు, కానీ తెలుగు సాహిత్యం రాసిన ఎనర్జిటిక్ హీరో
ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. కేవలం నటన మాత్రమే కాకుండా వారిలోని ఇంకొక కోణాన్ని బయటకు తీసిన రచయితలు కూడా ఉన్నారు. అయితే సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, కిరణ్ అబ్బవరం వంటి హీరోలు నటుడు గానే కాకుండా తమలోని రచయితను కూడా బయటపెట్టారు.
కానీ పాటలు రాసిన హీరోలు చాలా తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ కూడా ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా, అందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మొదటసారి పాటను రాశాడు రామ్ పోతినేని.
తెలుగు చదవలేని హీరోలు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలో ఉన్నారు. అయితే వారిలో కొంతమందికి కంప్లీట్ గా తెలుగు చదవడం కూడా రాదు. కొన్ని డైలాగ్స్ ను ట్వింగ్లిస్ లో రాసి ఇస్తారు కొంతమంది దర్శకులు. మహేష్ బాబు కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతారు. కానీ తెలుగు చదవడం అంతంత మాత్రమే వస్తుంది. ఇది పెద్ద తప్పు అని చెప్పలేము. ఎందుకంటే మహేష్ బాబు స్టడీస్ అన్నీ కూడా చెన్నైలో జరిగాయి. ఇకపోతే అలాంటి హీరోలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ తరుణంలో కూడా ఒక పెన్ పట్టుకొని సాహిత్యాన్ని రాశాడు అంటే అది మామూలు విషయం కాదు. అది రామ్ పోతినేని గొప్పతనం అని కూడా చెప్పాలి.
మంచి సాహిత్యం రాశాడు
సినిమాలో రామ్ పోతినేని పాట రాస్తున్నాడు అన్నప్పుడే చాలామందికి అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొంతమంది అయితే రామ్ కి అంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపడ్డారు. ఈ పాటను అనిరుద్ రవిచంద్రన్ పాడుతున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడు మంచి హై వచ్చింది. అయితే మామూలుగా ఐ లవ్ యు చెప్పకుండా లవ్ చేస్తున్నాను అని చెప్పడం ఎలా అని ప్రశ్నను కూడా ఒక వీడియో ప్రోమోలో అడిగాడు రామ్. సినిమాకి సంబంధించిన పాటలోని లిరిక్ ఇప్పుడు ఒకటి బయటకు వచ్చింది.
“ఒక చూపుతో నాలోనే పుట్టిందే… ఏదో వింతగా గుండెలో చేరిందే”
అనే లైన్ ఇప్పుడు ఆ పాటలో ఉంది. అయితే అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్లు, ఈ లైన్ తోనే రామ్ పోతినేని ఎంత అద్భుతమైన సాహిత్యాన్ని రాశాడు మనకు తెలిసిపోతుంది. కొద్దిసేపట్లో ఆ పాట రిలీజ్ కానుంది.
Also Read : Manisha Koirala: ఆ రోజే చనిపోతాననుకున్నా.. కానీ.. అసలు నిజం చెప్పిన మనీషా!