BigTV English

Ind vs eng test series: సుందర్, కరుణ్, నితీష్ లను ఇండియాకు పంపించిన బీసీసీఐ.. స్పెషల్ ఫ్లైట్ వేసి మరీ

Ind vs eng test series: సుందర్, కరుణ్, నితీష్ లను ఇండియాకు పంపించిన బీసీసీఐ.. స్పెషల్ ఫ్లైట్ వేసి మరీ

Ind vs eng test series:ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ని టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది భారత జట్టు. ఆ తర్వాత జరిగిన రెండో టెస్ట్ లో మాత్రమే గెలుపొందింది. అనంతరం లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లోను ఓటమిని చవిచూసింది. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో 2-1 తో భారత్ వెనకబడి ఉంది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. టెయిలెండర్స్ సాయంతో రవీంద్ర జడేజా పోరాడిన ఫలితం దక్కలేదు. ఇక ఈ ఇరుజట్ల మధ్య బుధవారం నుండి మాంచేస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కాబోతోంది.


ముగ్గురు ఆటగాళ్లపై వేటు?

ఈ సిరీస్ పై పట్టు సాధించాలంటే భారత జట్టు నాలుగోవ టెస్టులో కచ్చితంగా గెలవాల్సి ఉంది. అయితే మూడవ టెస్ట్ ఫలితం తర్వాత భారత జట్టులోని కొంతమంది ఆటగాళ్లు నాలుగో మ్యాచ్ లో ఆడడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సిరీస్ ప్రారంభమైనప్పటినుండి కొంతమంది ఆటగాళ్లు బాగా రాణించినప్పటికీ.. కొంతమంది మాత్రం షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు ఆటగాళ్లు నాలుగో టెస్ట్ మ్యాచ్ కి దూరంగా ఉండాల్సి రావచ్చు. వీరిలో కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి ముగ్గురు ఆటగాళ్లను నాలుగో టెస్ట్ నుంచి తప్పించనున్నట్లు సమాచారం.


దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఈ సిరీస్ తో భారత జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ అద్భుతంగా రాణిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి టెస్ట్ లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ ని తొలగించి.. రెండు, మూడవ టెస్టులలో కరుణ్ కి అవకాశం ఇచ్చారు. కానీ అతడు ప్రతి ఇన్నింగ్స్ లోను శుభారంభం చేసినప్పటికీ.. వాటిని భారీ ఇన్నింగ్స్ గా మార్చలేకపోయాడు. అతడి అత్యధిక స్కోర్ లార్డ్స్ మైదానంలోని తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగులు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు కరుణ్ 6 ఇన్నింగ్స్ లలో 131 పరుగులు మాత్రమే చేశాడు.

మరోవైపు వాషింగ్టన్ సుందర్ పై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి స్థానంలో ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ని ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు క్రీడాభిమానులు. ఎడ్జ్ బాస్టన్ లో వాషింగ్టన్ సుందర్ పెద్దగా రాణించలేకపోయాడు. కానీ లార్డ్స్ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు. నలుగురు కీలక ఇంగ్లాండ్ బ్యాటర్ల వికెట్లను పడగొట్టాడు. కానీ బ్యాటింగ్ లో ప్రత్యేకంగా ఏం చేయలేకపోయాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో కుల్దీప్ లేదా.. నాలుగవ పేసర్ కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

Also Read: Bahubali – Cricketers: బాహుబలి పాత్రల్లో టీమిండియా ప్లేయర్లు… కట్టప్ప ఎవరంటే?

ఇక మరో ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ని కూడా నాలుగో టెస్ట్ నుంచి తప్పించాలని పలువురు మాజీ ఆటగాళ్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. తన బౌలింగ్ తో కాస్త మంచి ఫలితాలను రాబట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. బ్యాట్ తో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలో నాలుగోవ టెస్ట్ కచ్చితంగా గెలవాల్సిన నేపథ్యంలో అతడిని కూడా నాలుగవ టెస్ట్ నుండి తప్పించాలని క్రీడాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లని తిరిగి భారత్ కి పంపిస్తున్నట్లుగా ఓ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×