Manisha Koirala: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా(Manisha Koirala) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఆరోజే చనిపోతాననుకున్నాను కానీ వారి వల్లే బయటపడ్డాను అంటూ ఒక చేదు నిజాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా తాను అనుభవించిన క్యాన్సర్ రోజులను గుర్తుచేసుకుంది మనీషా కొయిరాల. క్యాన్సర్ కి చికిత్స తీసుకునే సమయంలో నొప్పిని భరించలేకపోయాను అని.. వైద్యంతోపాటు తన తల్లి ప్రోత్సాహం , ఆమె ఇచ్చిన ధైర్యం వల్లే ఆ మహమ్మారి నుండి ధైర్యంగా ఆరోగ్యంగా బయటపడగలిగాను అంటూ కూడా చెప్పుకొచ్చింది.
ఆ రోజే చనిపోతాననుకున్నా – మనీషా కొయిరాలా..
ఇకపోతే ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కొయిరాల నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ.. “నాకు క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పినప్పుడు చనిపోతాను అనుకున్నాను. కానీ దేవుని దయవల్ల నేను చనిపోలేదు. మళ్లీ కొత్తగా జీవించడం నేర్చుకున్నాను”. అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది కొయ్రాల యొక్క ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఇంత గొప్ప నటి క్యాన్సర్ తో పోరాడి మరీ మహమ్మారి నుండి బయటపడిన విషయం తెలిసిందే.
2012లో క్యాన్సర్ పాడిన పడ్డ మనీషా కొయిరాలా..
ఒక మనీషా కొయిరాలా విషయానికి వస్తే 2012 లో మనీషా అండాశయ క్యాన్సర్ బారిన పడింది. మూడేళ్ల అనంతరం 2015లో ఆమె క్యాన్సర్ను జయించారు ఈ విషయంపైనే ఆమె గతంలో కూడా మాట్లాడడం జరిగింది.” న్యూయార్క్ లో ఉన్న గొప్ప వైద్యులు నాకు క్యాన్సర్ చికిత్స చేసారు. ఆరు నెలలు అక్కడే ఉన్నాను. దాదాపు 11 గంటలు ఆపరేషన్ చేశారు. కీమోథెరపీ గురించి నా కుటుంబానికి కూడా వైద్యులే వెల్లడించారు. వైద్యం కొనసాగుతున్న సమయంలో మా అమ్మ నా కోసం ఎన్నో పూజలు చేసింది. మహా మృత్యుంజయ హోమాలు కూడా జరిపించింది. నీకేం కాదు ధైర్యంగా ఉండు అంటూ నాలో నిరంతరం ధైర్యం నింపింది. ఆమె ఇచ్చిన ధైర్యంతోనే నేను ఈ మహమ్మారిని జయించాను అంటూ నాటి రోజులను కూడా గుర్తు చేసుకుంది.
క్యాన్సర్ పోరాటంపై పుస్తకం రాసిన మనీషా..
ఇక క్యాన్సర్ నుండి బయటపడిన తర్వాత తన జీవిత చరిత్ర గురించి ఒక పుస్తకం కూడా రాసుకుంది. 2018లో తన జీవిత చరిత్ర “హీల్డ్ : హౌ క్యాన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్” అనే పుస్తకాన్ని ఆవిష్కరించింది. క్యాన్సర్ నుంచి ఎలా బయటపడింది. దానికోసం ఏం చేసింది అనే సమాచారాన్ని అందులో పొందుపరిచింది.
రీ ఎంట్రీలో కూడా అదరగొడుతున్న మనీషా కొయిరాలా..
ఇక ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె గత ఏడాది సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరమండి వెబ్ సిరీస్ తో మళ్ళీ నటన రంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
మనీషా కొయిరాలా కుటుంబ జీవితం..
మనీషా కొయిరాలా కెరియర్ విషయానికి వస్తే.. ఈమె ఒక నేపాలి బ్యూటీ. పలు భారతీయ సినిమాలలో నటించింది. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా. నేపాల్ 22వ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2001లో నేపాలీ రాజ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది.
మనీషా కొయిరాలా తెలుగు చిత్రాలు..
ఒక మనీషా కొయిరాలా. భారతీయుడు, క్రిమినల్, ముంబై ఎక్స్ప్రెస్, నగరం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది
ALSO READ:Monalisa: కుంభమేళ మోనాలిసా క్రేజ్ మామూలుగా లేదుగా.. షూటింగ్ స్పాట్ నుండీ వీడియో వైరల్!