Tourist Family Film: ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా ఈ ఏడాది విడుదలైన సినిమాలలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో బాలీవుడ్ చిత్రం ఛావా(Chhaava) ఒకటి. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal) రష్మిక(Rashmika) ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 90 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 800 వందల శాతం లాభాలతో సుమారు 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమాని బీట్ చేస్తూ “టూరిస్ట్ ఫ్యామిలీ”(Tourist Family) అత్యధిక కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ లాభాల శాతంలో ఛావా సినిమాను బీట్ చేసిందని తెలుస్తోంది.
అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా..
టూరిస్ట్ ఫ్యామిలీ కేవలం రూ.7 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా సుమారు 90 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది. ఇలా అత్యంత తక్కువ బడ్జెట్ తో భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడంతో నిర్మాతలకు సుమారు 1200% లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇలా లాభాలపరంగా ఈ సినిమా ఛావా సినిమాను బీట్ చేస్తూ ఈ ఏడాది అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నెంబర్ వన్ స్థానంలో ఉంది. తమిళ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల అయ్యి సంచలనాలను సృష్టించింది.
సిమ్రాన్.. శశి కుమార్ జంటగా..
ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇక ఓటీటీలో కూడా ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో సిమ్రాన్(Simran) శశి కుమార్(Sashi Kumar) ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే..ధర్మదాస్ ( శశికుమార్) వాసంతి (సిమ్రాన్) భార్యాభర్తలు. వారి సంతానమే నీతూ షాన్( మిథున్) మురళి (కమలేశ్). ఈ ఫ్యామిలీ శ్రీలంక నుంచి అక్రమంగా ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడతారు. అయితే వాసంతి అన్నయ్య ప్రకాష్ (యోగి బాబు) సహాయంతో మీరు ఇండియాలోనే ఒక ఇంట్లో అద్దెకు ఉండి స్థిరపడతారు . ఇక చుట్టుపక్కల వాళ్లతో తాము కేరళ నుంచి వచ్చామని అందరినీ నమ్మిస్తూ ఉంటారు.
చిన్న సినిమా… పెద్ద సక్సెస్..
ఇలా ధర్మదాస్ కుటుంబం అందరినీ నమ్మిస్తూ భయం భయంగా బ్రతుకుతూ ఉంటారు. అదే సమయంలో సిటీలో జరిగిన ఒక బాంబ్ బ్లాస్ట్, పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. ఈ బాంబ్ బ్లాస్ట్ కు ఇండియాలోకి అక్రమంగా చొరబడిన వాళ్లే కారణమని పోలీసులు భావిస్తూ ఉంటారు అయితే ధర్మదాస్ ఇంట్లో అద్దెకు దిగిన పోలీసులకు వీరి పట్ల అనుమానం వస్తుంది. దాంతో ఆ విషయాన్ని పై అధికారికి చెబుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది సినిమా కథ. ఇలా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టి, ఈ ఏడాది అత్యధికంగా కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.
Also Read: House Full 5 OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ ఎంటర్టైనర్… స్ట్రీమింగ్ ఎక్కడంటే?