Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela)ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో పాటు ఈమె బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు గాలికిరీటి రెడ్డి(Gali Kireeti Reddy)తో కలిసి నటించిన జూనియర్ (Junior)సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఈమె పాత్ర పెద్దగా ప్రాధాన్యత లేకపోయిన ఉన్నంతలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల వరుస ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
కెరియర్ పైనే పూర్తి ఫోకస్…
ఈ క్రమంలోనే సీనియర్ నటి జెనీలియా, హీరో కిరీటి రెడ్డితో కలిసి శ్రీలల యాంకర్ సుమ(Suma)తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరితో సరదాగా ముచ్చటిస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. కిరీటి రెడ్డి ఈ సినిమాల కోసం అమ్మాయిలను కూడా పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలియజేశారు ఇప్పటివరకు తనకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదని తెలిపారు. తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని క్లారిటీ ఇచ్చారు . ఇక శ్రీ లీల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. తాను ప్రేమలో పడే ఛాన్స్ కూడా లేదని ఎక్కడికి వెళ్లిన తన అమ్మ తనతో పాటే ఉంటుందని శ్రీ లీలా తెలియచేశారు.
10 సంవత్సరాలు…
ప్రస్తుతం తనకు ప్రేమ, పెళ్లి గురించి ఆలోచనలు లేదని తెలిపారు. మరో 10 సంవత్సరాల వరకు పెళ్లి గురించి ఆలోచన లేదని, ఈ సందర్భంగా శ్రీ లీల క్లారిటీ ఇచ్చారు. శ్రీ లీలా ఇలా చెప్పడంతో నేను కూడా ఎక్కడికి వెళ్లినా నా వెంట మా అమ్మ ఉండేది కానీ రాజీవ్ ప్రేమలో పడ్డాను మీకు కూడా అలా అంటూ సుమా అడగడంతో నో ఛాన్స్ అంటూ సమాధానం చెప్పారు. ఇలా మరో 10 సంవత్సరాల పాటు పెళ్లికి తావు లేదని, పూర్తిగా కెరియర్ పైనే ఫోకస్ పెట్టినట్లు శ్రీ లీల ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే శ్రీలీల బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
కార్తీక్ ఆర్యన్ తో రిలేషన్?
ఈ వార్తలకు అనుగుణంగా శ్రీ లీల కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan)ఇంట్లో జరిగే ఫంక్షన్లకు హాజరు కావడం వీరిద్దరూ జంటగా బయట కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అదేవిధంగా కార్తీక్ ఆర్యన్ తల్లి తన ఇంటికి రాబోయే కోడలు డాక్టర్ అయి ఉండాలి అంటూ చెప్పడంతో కచ్చితంగా వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అయిందని అభిమానులు భావిస్తున్నారు. శ్రీ లీల కూడా ఇటీవల తన డాక్టర్ కోర్స్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇలా శ్రీలీలను దృష్టిలో పెట్టుకొని కార్తీక్ ఆర్యన్ తల్లి అలా మాట్లాడారంటూ అభిమానులు భావిస్తున్నారు కానీ ఇప్పటివరకు ఈ విషయంపై శ్రీ లీల ఎక్కడ స్పందించలేదు. ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో మాస్ జాతర సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు నటిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read:Big tv Kissik Talks: వేరే వ్యక్తితో ప్రేరణ కిస్.. అందువల్లే బ్రేకప్.. ఇంత గొడవ అయ్యిందా?