Ramayana:సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తోంది అంటే ఆ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ ఏ రేంజ్ లో చేపడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా చిన్న డైరెక్టర్లను మొదలుకొని.. పెద్దపెద్ద డైరెక్టర్ల వరకు తమ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇంకొంతమంది కాస్త వినూత్నంగా ఆలోచిస్తూ పబ్లిక్ లో స్టంట్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న హై యాక్టేన్ మూవీ రామాయణ ప్రమోషన్స్ హడావిడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పేరుకే నాలుగు వేల కోట్ల బడ్జెట్ అని ప్రకటించారు కానీ అసలు ఆ స్థాయి ప్రమోషన్స్ కనిపించకపోవడం అభిమానులలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే జక్కన్న వారణాసి మూవీని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సినిమా గ్లింప్స్ చూపిస్తూ.. ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే ఈ రూ.1000 కోట్ల బడ్జెట్ మూవీకి5 ఈ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు అంటే.. ఇక రూ.4000 కోట్ల బడ్జెట్ సినిమాకి ఇంకా ఎంత ప్రమోషన్స్ చేయాలి. కానీ రామాయణ మేకర్స్ అటు డైరెక్టర్ నితేష్ తివారీ ఇవేవీ పట్టనట్టు సైలెంట్ గా ఉండడాన్ని సినీ వర్గాలు సైతం జీర్ణించుకోలేకపోతున్నాయి.
నిజానికి అప్పుడెప్పుడో ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రకటనకు తగ్గట్టుగానే ఒక చిన్న గ్లింప్స్, రాముడిని పరిచయం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారే తప్ప.. ఇక అప్పటినుంచి ఏ ఒక్క అప్డేట్ లేకపోవడం గమనార్హం. సినిమా అనౌన్స్మెంట్ జరిగి ఏడాదికి పైగానే అవుతున్నా.. షూటింగ్ ప్రారంభించి ఆరు నెలలకు పైగానే అవుతున్నా ఇంకా ఎటువంటి అప్డేట్ కనిపించడం లేదు. దీంతో రామాయణ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
also read:పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ఊహించని ట్విస్ట్.. 16 నిమిషాల సుదీర్ఘ వీడియోతో!
మరోవైపు బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. రణబీర్ కపూర్ , సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ రామాయణ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే. ఇండియాలో కాకుండా లాస్ ఏంజిల్స్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించి, ఆ ఈవెంట్లో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
జూలై 14వ తేదీన భారీ ఈవెంట్ ను నిర్వహించి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో సినిమాపై అంచనాలు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. మరి విజువల్ వండర్ గా రాబోతున్న రామాయణ గ్లింప్స్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయినా.. కనీసం ట్రైలర్ తో నైనా మెప్పిస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా 4వేల కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.