E-Paper
Advertisement

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్
Advertisement

Niharika Lavanya: నిహారిక, లావణ్య ఇద్దరూ కలిసి జాతీయ జెండాను ఎగరేస్తున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.మాములుగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. అలాంటిది స్వాతంత్ర  దినోత్సవం రోజున చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిహారిక, లావణ్య, సుస్మిత తో పాటు మిగతా మెగా ప్యామిలీ కలిసి కనిపించడంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.

ఇక జెండా ఎగరేసిన తర్వాత ఇద్దరూ అక్కడ ఉన్నవారితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు షేర్ కావడంతో కూడా తమదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు మూవీ లవర్స్.

Advertisement

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటే..

ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం ద్వారా ఎన్నో ఏళ్లుగా రక్తదానం వంటి కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెల్సిందే. రక్తం అవసరమైన సమయంలో ఎంతోమందికి ఈ బ్లడ్ బ్యాంక్ అండగా నిలబడి ఆదుకుంది కూడా.అందుకే ఇలాంటి చోట స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరేయడం కూడా ప్రత్యేకంగా మారింది.

Advertisement

మెగా ఫ్యామిలీకి సేవా కార్యక్రమాలతో అనుబంధం

చిరంజీవి సినిమాల్లోనే కాదు.. సేవా కార్యక్రమాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్లడ్ బ్యాంక్‌తో పాటు కంటి బ్యాంక్, రక్తదానం వంటి కార్యక్రమాలపై ఎన్నో సంవత్సరాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.చిరంజీవి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమా ల్లో పాల్గొంటూ ఉంటారు. పుట్టినరోజులు, సినిమా రిలీజ్‌లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో మెగా అభిమానులు రక్తదానం చేయడం చాలా కాలంగా కనిపిస్తున్న విషయమే.

నిహారిక విషయానికి వస్తే

నిహారిక కొణిదెల విషయానికి వస్తే.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ వంటి సినిమాల్లో నటించింది. తర్వాత నిర్మాతగా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా తీసి సాలిడ్ హిట్ అందుకోవడమే కాకుండా నేషనల్ అవార్డ్ ని కూడా కొట్టేసింది.

ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి కూడా. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లావణ్యతో కలిసి జెండా ఎగరేసిన ఫొటోలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లావణ్య మెగా ఫ్యామిలీలో భాగమైంది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై మెగా అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.

సినిమాలకు అతీతంగా మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ అంటే అభిమానులకు సినిమాలు, హీరోలు, హిట్‌లు మాత్రమే గుర్తుకు రావు. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా గుర్తొస్తాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అందుకు మంచి ఉదాహరణ అని చెప్పకతప్పదు.

 

Tags

Related News

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. ఎన్టీఆర్ మీల్ సేవలు క్లోజ్

చిరంజీవితో బుచ్చిబాబు.. కాంబో ఫిక్స్ అయిపోయిందా?

వెంకీ మామ చేతికి మళ్లీ గన్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్‌గా!

రాజు వెడ్స్ రాంబాయి భామ… పలుచని చీరలో అదరగొట్టేసిందిగా !

కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!

Big Stories

Advertisement
×