2027 Sankranti: ఈ ఏడు సంక్రాంతికి ఒకటి రెండు కాదు ..రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒక రాజు, భర్త మహాశయులకి విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి అంటూ ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఇక వీటిలో రాజాసాబ్ డిసప్పాయింట్ చేసినప్పటికీ ,మిగతా నాలుగు సినిమాలు డీసెంట్ వసూళ్ళని కొల్లగొట్టాయి.వీటిలో భర్త మహాశయులకి విజ్ఞప్తి కాస్త వెనకా ముందు అయినా మిగతామూడు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేశాయి.దీంతో కంటెంట్ కరెక్ట్ గా డెలివర్ అయితే పండక్కి పండగ చేసుకోవచ్చంటూ వచ్చే పొంగల్ బరిలో కూడా పెద్ద సినిమాలన్నీ క్యూ కట్టేశాయ్ .
మెగాస్టార్ చిరంజీవి ‘మెగా 158’ కూడా ఇదే పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు.ఇక చిరు సినిమా అంటేనే ఫ్యాన్స్‌లో ఏ రేంజ్ హడావుడి ఉంటుందో చెప్పక్కర్లేదు.. పైగా సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి సినిమా అంటే అంచనాలు ఇంకా పెరుగుతాయి. థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్ చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరోవైపు వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్ కూడా వస్తోంది. ఈ ఇద్దరి కాంబో అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి అంచనాలు ఉంటాయి. వెంకీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.. అనిల్ రావిపూడి అంటే కామెడీ, మాస్, ఎమోషన్. కాబట్టి ఈ సినిమా కూడా సంక్రాంతికి మంచి కలెక్షన్లు కొట్టాలని చూస్తోంది.
ఇక శర్వానంద్–జెర్జ్ క్రిష్ సినిమా కూడా రేసులో ఉండటంతో పోటీ మరింత పెరిగింది. శర్వానంద్‌కు యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక వీటితో పాటు నాగ్ 100 కూడా పొంగల్ వైపు దిక్కులు చూస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది.ఇక డిసెంబర్ లో వస్తానన్న బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో కూడా సంక్రాంతికి ఖర్చీఫ్ వేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట .దీంతో ఇన్ని సినిమాలకి థియేటర్లు ఎలా అడ్జెస్ట్ అవుతాయో ఏంటో అని తలలు పట్టుకుంటున్న డిస్టిబ్యూటర్, ఎగ్జిబిటర్ లకి మరో షాక్ ఇస్తూ రెడీ అయిపోయాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ .
అవును ..నేనూ మీకు పోటీగా వస్తానంటూ సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కూడా పొంగల్ బరిలో దిగేందుకు సిద్దమైంది. అవును ..చాలా రోజులుగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ జనవరి 12, 2027న థియేటర్లలోకి వస్తామని ఇండిపెండెన్స్ డే సందర్భంగా పవర్‌ఫుల్ పోస్టర్‌తో డేట్ అనౌన్స్ చేసేశారు.
ఇప్పటికే ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌తో సినిమాపై మంచి హైప్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా వచ్చేయడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమా కూడా భారీ యాక్షన్‌తో తెరకెక్కుతోందట. పెద్ద సెట్స్, భారీ ఫైట్స్, మంచి విజువల్స్‌తో సినిమాను గట్టిగానే ప్లాన్ చేశారు.
అయితే పండగ కలిసివస్తుంది కదా అంటూ అందరూ పొంగల్ బరిలోకి దిగాలని చూడటంతో ఇన్ని సినిమాలు ఒకే పండగని టార్గెట్ చేస్తే వచ్చే కలెక్షన్స్ ఎలా పంచుకోవాలని మల్ల గుల్లాలు పడుతున్నారట డిస్టిబ్యూటర్లు.
సాధారణంగా ఒకే ఏరియాలో నాలుగు సినిమాలు వస్తే.. అందరికీ ఫస్ట్ డే ఫస్ట్ షో కావాలి. అందరి ఫ్యాన్స్‌కు తమ హీరో సినిమా మొదటి షోలోనే చూడాలి. నిర్మాతలకు ఎక్కువ థియేటర్లు కావాలి.కానీ ఉన్నవి కొన్నే .మరి ఈ పరిస్థితుల్లో ఎవరికీ ఎలా వీటిని సర్దుబాటు చేస్తారా అన్న క్యూరియాసిటీ ఇపుడు ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తుంది.
also read:రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!
మొత్తానికి 2027 సంక్రాంతికి ఇంట్లో పండుగ కంటే థియేటర్ల దగ్గరే ఎక్కువ రచ్చ జరిగేలా ఉంది. చిరంజీవి, వెంకటేష్, శర్వానంద్, సాయి దుర్గ తేజ్.. ఇలా వరుసగా స్టార్ హీరోలు బరిలో ఉంటే ప్రేక్షకుడికి మాత్రం పండగే. కానీ ఈ సినిమాలన్నీ చూసే లోపు పండగ సెలవులు కాస్తా అయిపోతాయేమో ..అన్ని బరిలో ఉండేలా ఉన్నాయి మరి!