E-Paper
Advertisement

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..
Advertisement

Seyon Movie: తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈయన సినిమాలు డబ్ అవడంతో ప్రేక్షకులు శివ కార్తికేయన్ నటనకు ఫీదా అవుతున్నారు. ఈ హీరో నటించిన అమరన్ చిత్రం జనాలని ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పరవాలేదు అనిపించినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం ఈయన ‘సెయాన్ ‘ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి తాజాగా ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అందులో శివ కార్తికేయని ఎలా ఉన్నాడు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మాస్ లుక్ లో శివకార్తికేయన్..

తమిళ హీరో శివ కార్తికేయన్ మాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సెయాన్ మూవీ నుంచి తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ని విడుదల చేశారు. మాస్ లుక్ లో గడ్డం తో కనిపిస్తున్న శివ కార్తికేయన్ పోస్టర్ పై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని రాశారు.. ఈ సినిమా మొత్తం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని ఈ పోస్ట్ ర్ ని చూస్తే మరోసారి అర్థమవుతుంది.. గతంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించిన శివ కార్తికేయన్ ఇప్పుడు మాస్ జోనర్ లోనే సినిమా చేస్తున్నాడు అని అర్థమవుతుంది. పవర్ఫుల్ స్టోరీ తో ఈ సినిమా ఉండబోతుంది అని గతంలో ఓ ఇంటర్వ్యూలో హీరో బయటపెట్టారు. ఏది ఏమైనా కూడా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

Advertisement

Also Read :Podarillu Today Episode : శైలుకు రేపే పెళ్లి.. మహాను చూసి ఫిదా.. పెద్దోడికి జోడీ దొరికేసిందా..?

‘సెయాన్ ‘ మూవీ విషయానికోస్తే..

సెయాన్ మూవీలో శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న చిత్రం సెయాన్. శివకుమార్ మురుగేశన్‌ దర్శకుడు. ‘అమరన్’ తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివకార్తికేయన్ చేస్తున్న చేస్తున్న ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. గతంలో శివ కార్తికేయన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పోస్టరు జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఎమోషన్స్, మాస్ అప్పీల్, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎంటర్టైనర్ గా సినిమా రూపొందనుంది.. వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, షాన్ లోకేష్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పోస్టరు కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా జనాలని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.. ఇక శివ కార్తికేయన్ ఈ సినిమా తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటించేందుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే ఆ సినిమాల గురించి అనౌన్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Advertisement

Related News

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్.. ఎన్టీఆర్ మీల్ సేవలు క్లోజ్

చిరంజీవితో బుచ్చిబాబు.. కాంబో ఫిక్స్ అయిపోయిందా?

వెంకీ మామ చేతికి మళ్లీ గన్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్‌గా!

రాజు వెడ్స్ రాంబాయి భామ… పలుచని చీరలో అదరగొట్టేసిందిగా !

కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!

Big Stories

Advertisement
×