E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ఊహించని ట్విస్ట్.. 16 నిమిషాల సుదీర్ఘ వీడియోతో!

పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ఊహించని ట్విస్ట్.. 16 నిమిషాల సుదీర్ఘ వీడియోతో!
Advertisement

Raghava Lawrence:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాఘవ లారెన్స్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు సమాజ సేవ చేస్తూ గొప్ప మనసున్న వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి ఈయన గత కొంతకాలంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రిజైన్ చేసిన తిరుచ్చి ఈస్ట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాఘవ పొలిటికల్ ఎంట్రీ పై స్పందిస్తూనే.. మరొకవైపు రెండు వారాల క్రితం సోషల్ మీడియాలో తాను చేసిన కామెంట్ల వల్ల తాను ఎదుర్కొన్న విమర్శలు, కాంట్రవర్సీపై మళ్ళీ స్పందిస్తూ సుమారుగా 16 నిమిషాల సుదీర్ఘ వీడియోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు.

పొలిటికల్ ఎంట్రీపై రాఘవ క్లారిటీ..

గత కొన్ని రోజులుగా రాఘవ రాజకీయాల్లోకి రాబోతున్నారని, సీఎం విజయ్ కాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానంలో జరిగే ఉప ఎన్నికల్లో నిలబడతారని రూమర్స్ వినిపించాయి. దీనికి తోడు మూడు వారాల క్రితం ప్రెస్ మీట్ పెట్టిన లారెన్స్.. దీని గురించి చెప్పి చెప్పకుండా మాట్లాడి వదిలేశాడు .ఇప్పుడు ఎట్టకేల్టకు పొలిటికల్ ఎంట్రీ పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 16 నిమిషాల వీడియో పోస్ట్ చేసిన లారెన్స్.. అందులో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..” నేను తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయడం లేదు. టీవీకే నుంచి నేను బరిలోకి దిగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయాలపై నాకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమే అయినా పోటీ చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు రాఘవ.

సోషల్ మీడియా కాంట్రవర్సీపై రాఘవ రియాక్షన్..

Advertisement

ఇకపోతే ఇదే వీడియోలో సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మరోసారి ఖండించే ప్రయత్నం చేశారు. విషయంలోకి వెళ్తే.. ప్రజలు , అభిమానులు ఆమోదిస్తేనే తాను రాజకీయ ప్రయాణం మొదలు పెడతానని.. లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటాను అంటూ స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన తర్వాత తమిళ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. అదే సమయంలో ఆయన ప్రజలను ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారు” అంటూ ఒక వీడియో క్లిప్ కూడా వైరల్ అయింది. దీనిపై కూడా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రెస్ మీట్ కి సంబంధించి ఒక అపోహను నివృత్తి చేయాలనుకుంటున్నాను.

also read:అల్లరి నరేష్ ఇప్పటివరకు చూడని తన సినిమా ఏంటో తెలుసా?

అమ్మతో సమానం..

Advertisement

ప్రజలు ,అభిమానులు నాకు అమ్మతో సమానం. అలాంటిది నేనెందుకు ప్రజలను, అభిమానులను కుక్కలతో పోలుస్తాను. అది పూర్తిగా అసత్యం. మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు అక్కడ పరిసరాలను, ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందని చెప్పాను. అంతేకానీ నేను గౌరవించే, అమ్మలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠినమైన వాడిని కాదు. మళ్లీ మళ్లీ వివరణ ఇస్తున్నాను ప్రజలను నేను ఏ విధంగాను తప్పు పట్టలేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే రాఘవ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ‘ఇళ్ల స్థలాల’ దందా.. నాకు సంబంధం లేదన్న టాలీవుడ్ డైరెక్టర్

అల్లరి నరేష్ ఇప్పటివరకు చూడని తన సినిమా ఏంటో తెలుసా?

Mahidhar: ఆంధ్ర వర్సెస్ తెలంగాణ.. ‘ఇడుపు కాయితం’ రచ్చపై నోరుజారి క్లారిటీ ఇచ్చిన మహిధర్!

సమంత జీవితాంతం ఆ నరకం అనుభవించాల్సిందేనా.. నిజాలు బయటపెట్టిన నందిని రెడ్డి!

పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. రాత్రంతా నిద్రపట్టలేదంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్!

ప్రేమలో పడ్డ నిహారిక.. బుగ్గలు కొ*రి*కేస్తూ మరీ రొమాంటిక్ ఫోజులు!

Raju weds Rambai Hero : వివాదంలో ఇరుక్కున్న హీరో.. డెలివరీ బాయ్ పై దాడి..

Big Stories

×