Comrade Kalyan:శ్రీ విష్ణు…చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరోగా ఎదిగిన ఇపుడు కామెడీ సినిమాలకి కేరాఫ్ అయిపోయాడు.ముఖ్యంగా సో కాల్డ్ కమర్షియల్ సినిమాల మాయలో పడకుండా కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని టేకప్ చేస్తూ మిగతా హీరోలకి భిన్నంగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.ఇక ఇదే క్రమంలో ఇపుడు కామ్రేడ్ కళ్యాణ్’అంటూ మరో సినిమాని పట్టాలెక్కించాడు.
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూవీ నుండి పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో ఎర్రకండువా వేసుకుని, చేతిలో గన్ పట్టుకుని,ఈ సారి సీరియస్ లుక్ లో దర్శనమిచ్చాడు.ఇక పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే అడవి, చుట్టూ గన్స్ పట్టుకున్న మనుషులు మెడలో ఎర్రటి కండువాలు ..మొత్తంగా చూస్తే శ్రీవిష్ణు ఈసారి కాస్త సీరియస్ నక్సలైట్ సబ్జెక్ట్ కే ఓటేసినట్టు తెలుస్తుంది.
కథ విషయానికి వస్తే
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ కథ అంతా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్టు వచ్చిన గ్లిప్మ్స్ బట్టి అర్థమయిపోతుంది.కళ్యాణ్ కామ్రేడ్ లా ఎందుకు మారాడు,గ్రే హౌండ్స్ పోలీసులకి, ఈ కామ్రేడ్ బ్యాచ్ కి ఎలాంటి వార్ జరిగింది, ఇందులో కళ్యాణ్ పాత్ర ఏంటి అనేది ఆసక్తికరంగా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
అయితే ఇంత సీరియస్ సబ్జెక్ట్ లోనూ శ్రీ విష్ణు కి అచ్చి వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ ని ఈ సినిమాలో దట్టించాడట డైరెక్టర్.ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఒరియా పిల్ల’పాటని చూస్తుంటే అది అర్థమవుతుంది కూడా.ఇక ఈ పాటలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ మధ్య కుదిరిన కెమిస్ట్రీ హైలెట్ అని చెప్పాలి.ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇవ్వగా ‘ఒరియా పిల్ల’పాటని సిద్ శ్రీరాం పాడారు.1990ల నాటి వింటేజ్ ఫీల్ వచ్చేలా ఈ పాటను మేకర్స్ తెరకెక్కించడం విశేషం.
ఇకపోతే ఈ సినిమాని కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తుండగా వెంకట కృష్ణ కర్ణాటి, సీతా కర్ణాటి నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఎలాంటి మెమోరీస్ అందిస్తుందో !
ఇక శ్రీ విష్ణు కెరీర్ విషయానికి వస్తే ‘రాజ రాజ చోర’, ‘సామజవరగమన’, ‘సింగిల్’లాంటి సినిమాల్లో కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు గత సినిమాలైన విష్ణు విలాసం,మృత్యంజయ సినిమలాతో వరుస ప్లాపులని మూటగట్టుకున్నాడు.
చూడాలి మరి అక్టోబర్ 9 వరల్డ్ వైడ్ గా రిలీక్ కానున్న ఈ సినిమా శ్రీ విష్ణుకి ఎలాంటి మెమోరీస్ అందిస్తుందో !