OG Movie: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం దగ్గరపడుతోంది. ఇన్ని రోజులపాటు పవన్ నటించిన ఓజీ మూవీ(OG Movie) కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. మరొక ఐదు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఒక పాటను కూడా విడుదల చేయడంతో ఈ పాటకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాటను విడుదల చేసిన అనంతరం ఓజీ మూవీ పక్కా డిజాస్టర్ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ సినిమా డిజాస్టర్ అంటూ కామెంట్లు చేయడం వెనుక కారణం ఏంటనే విషయానికి వస్తే సెంటిమెంట్ ప్రకారం అభిమానులు ఈ సినిమా విషయంలో కాస్త కంగారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పలు సినిమాలలో పాటలు పాడారు. అయితే ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పాట పాడటంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
పవన్ పాట పాడితే.. సినిమా ఫట్?
పవన్ కళ్యాణ్ గతంలో అజ్ఞాతవాసి(Agnyaatha Vaasi) సినిమా కోసం ఒక పాట పాడారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ఒక పాట పాడారు అయితే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే ఓజీ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ పాట పాడటంతో ఈ సినిమా విషయంలో కూడా బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొంతమంది ఈ కామెంట్లను తిప్పి కొడుతున్నారు. ఓజీ సినిమా విషయంలో ఎలాంటి ఆందోళనలు వద్దని, కచ్చితంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఓజీ సినిమా నుంచి తాజాగా పవన్ పాడిన “వాషియో.. వాషి” అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ పాట మొత్తం జపనీస్ భాషలోనే కొనసాగుతోంది. ఇకపోతే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజీత్(Sujeeth) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర వీరమల్లు పూర్తిగా నిరాశపరిచిన, ఓజీ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఓజీ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది