Kotthapalli lo Okappudu Teaser:కంటెంట్ ఉంటే చాలు నటీనటులతో పనిలేదు అని నిరూపిస్తున్నాయి ఎన్నో చిత్రాలు. చిన్న సినిమాలుగా వచ్చి భారీ కలెక్షన్స్ వసూలు చేస్తూ పెద్ద హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టేస్తున్నాయి. అలా ఇప్పుడు అద్భుతమైన కంటెంట్ తో మళ్ళీ ప్రేక్షకుల మనసులు గెలుచుకొని భారీ కలెక్షన్స్ వసూలు చేయడానికి సిద్ధం అయ్యారు కేరాఫ్ కంచరపాలెం(C/o kancharapalem) నిర్మాతలు. టాలీవుడ్ లో క్లాసిక్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఎమోషనల్ కంటెంట్ తో రియలిస్టిక్ కథగా ఈ చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha) చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాని ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. అంతే కాదు ఇందులో ప్రతి పాత్ర కూడా చూసే ఆడియన్ కి కనెక్ట్ అయ్యింది అనడంలో సందేహం లేదు.
రానా నిర్మాణంలో మరో కొత్త మూవీ..
ఈ చిత్రాన్ని ప్రవీణ్ పరుచూరి (Praveen Paruchuri), రానా దగ్గుబాటి (Rana daggubati) సంయుక్తంగా నిర్మించారు.. అయితే ఇప్పుడు మళ్లీ వీరి చేతుల మీదుగా ఇంకో సినిమా రాబోతోంది. ఇకపోతే ప్రవీణ్ పరుచూరి ఈసారి ప్రొడ్యూసర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా మారి చేస్తున్న చిత్రం ‘కొత్తపల్లిలో.. ఒకప్పుడు'(Kotthapallilo okappudu). ఈ సినిమాను రానా దగ్గుబాటి తో కలిసి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా నిన్న ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ వదిలారు. జూన్ 4 సాయంత్రం 5:04 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో నటీనటులు ఎవరు? ఎలాంటి కథతో వస్తోంది? అనే ఆసక్తి ప్రేక్షకులలో కలిగింది. ఇక ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు? అసలు ఈ టీజర్ ఎలా ఉంది ?టీజర్ కథ ఏంటి ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ టీజర్ ఎలా ఉందంటే?
టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఇందులో బెనర్జీ గ్రామ పెద్దగా నటించారు. కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరి జనం అంతా కలిసి ఒక యువకుడు చేసే పనులను ఊరి పెద్ద బెనర్జీ దగ్గర చెప్పుకోవడానికి వస్తారు. దీంతో ఆ యువకుడు కథేంటి? ఆ యువకుడు చేస్తున్న పని ఏంటి ?అని తెలుసుకోవడానికి బెనర్జీ ఆ యువకుడిని అసలు విషయం అడుగుతాడు. కానీ ఆ యువకుడు తన సమస్యను చెప్పుకునే లోపే ఊరి పెద్దలంతా ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు అంటూ అతడిపై లేనిపోని నిందలు వేస్తారు.
కట్ చేస్తే.. ఆ గ్రామంలో ఉండే యువకుడు ఒక రికార్డింగ్ స్టూడియో ఉంది చూడూ.. నాలుగు షోలు పడ్డాయి.. అసలు మన ఊర్లో డాన్స్ చేసే అమ్మాయిలే లేరా అంటూ తన స్నేహితుల పై ఫ్రస్టేషన్ తో ఊగిపోతూ ఉంటాడు. ఇక దాంతో ఒక అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది అని తెలిసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటపడుతూ ఉంటాడు. ఆఖరికి ఆ అమ్మాయి వాష్ రూమ్ కి కూడా వెళ్లలేని పరిస్థితి. అసలు విషయం తెలియని ఊరి పెద్దలు అమ్మాయిని గోకుతున్నాడు అంటూ ఆ యువకుడి పై ఊరి పెద్ద దగ్గర కంప్లైంట్ చేస్తారు. ఇక తర్వాత ఆ యువకుడు అసలు నిజం చెప్పాడా..? ఆ అమ్మాయి అతడి రికార్డింగ్ డాన్స్ షోలో డాన్స్ చేయడానికి ఒప్పుకుందా ? అసలేం జరిగింది? అని ఫన్నీ ఇన్సిడెంట్ తో ఈ సినిమాను కాస్త విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి మరేదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
also read:Sarzameen Trailer: పృథ్వీరాజ్ సర్జమీన్ ట్రైలర్ రిలీజ్.. సైఫ్ కొడుకు మెప్పించారా?