Sarzameen Trailer: ప్రముఖ మలయాళ స్టార్ దర్శకుడు, నటుడు, హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో తాజాగా నటిస్తున్న చిత్రం సర్జమీన్(Sarzameen). ఈ సినిమా డైరెక్ట్ గా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan )ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జూలై 25 వ తేదీ నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.
కాశ్మీర్ నేపథ్యంలో సర్జమీన్..
ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించగా .. ఆయన భార్య మీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజోల్ (Kajol)నటిస్తోంది. అలాగే ఇందులో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఉగ్రవాదిగా నటిస్తున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో దేశ రక్షణ కోసం ఉగ్రవాదులపై ఆర్మీ ఆఫీసర్లు ఎలాంటి యుద్ధం చేశారు? వారు చేసిన సాహసం ఏంటి? అనేది చాలా చక్కగా చూపించనున్నారు. ఈ సినిమాతో కాయోజ్ ఇరానీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన ట్రైలర్ ఎలా ఉంది? ఇందులో ఇబ్రహీం తన నటనతో ఆకట్టుకున్నారా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
సర్జమీన్ ట్రైలర్ ఎలా ఉందంటే?
సర్జమీన్ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తూ ఉండగా.. ఇందులో ఆయన తన కొడుకును సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూనే.. మరొకవైపు ఉగ్రవాదుల నుండి దేశాన్ని ఎలా కాపాడారు అనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. అటు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని మెప్పించారు అని చెప్పవచ్చు. ట్రైలర్ తోనే దేశభక్తిని నింపేసిన యూనిట్ ఇక సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసి ఉంటే బాగుండేది అని కూడా సలహా ఇస్తూ ఉండడం గమనార్హం.
ఇబ్రహీం అలీ ఖాన్ సినిమా జీవితం..
ఇబ్రహీం అలీ ఖాన్ హిందీ చిత్రాలలో ఎక్కువగా పని చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ – అమృత సింగ్ దంపతులకు జన్మించిన ఈయన.. 2008లో తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించిన తాషన్ సినిమాలో చిన్న వెర్షన్ గా బాల్యంలో తొలిసారి నటన ప్రదర్శన కనబరిచారు. తర్వాత నెట్ ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ చిత్రం నాదనియన్ సినిమాలో తొలిసారి హీరోగా నటించారు. ఈ ఏడాది ఈ సినిమా విడుదలైంది. అంతేకాదు మరొకవైపు కునాల్ దేశ్ ముఖ్, దినేష్ విజన్ దర్శకత్వం వహించి నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా డైలర్ లో కూడా నటిస్తున్నారు.
also read:Varsha Bollamma: ఆ టాలీవుడ్ హీరో అంటే పిచ్చి.. ఆ ఒక్క సినిమా 50 సార్లు చూశాను అంటూ!