Anchor Suma: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ టక్కున సుమ కనకాల(Suma Kanakala) పేరు గుర్తుకు వస్తుంది. ఈమె మలయాళ అమ్మాయి అయినప్పటికీ తన తల్లిదండ్రుల ఉద్యోగ నిమిత్తం హైదరాబాదులో స్థిరపడి తెలుగు ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా స్థిరపడిపోయారు. అయితే సుమ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో యాంకర్ గా కాకుండా బుల్లితెర సీరియల్స్ లో హీరోయిన్ గా నటించారు. అలాగే వెండి తెరపై సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఈమె హీరోయిన్గా కూడా ఓ సినిమా చేశారని తెలుస్తోంది. అయితే సినిమాల పరంగా సక్సెస్ రాకపోవడంతో సుమ కనకాల తిరిగి యాంకర్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.
కళ్యాణ ప్రాప్తిరస్తు..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ నిత్యం సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ వేడుకలు అంటూ ఏమాత్రం తీరికలేకుండా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా సుమ ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుమ కీలక పాత్రలో నటించారు అయితే 1996 సంవత్సరంలోనే ఈమె హీరోయిన్ గా ఓ సినిమాలో నటించారని తెలుస్తోంది. సుమ డిగ్రీ చదువుతున్న సమయంలోనే ఏకంగా దాసరి నారాయణరావు( Dasari Narayana Rao) గారు నుంచి తనకు పిలుపు వచ్చిందని తెలిపారు. అయితే అప్పటివరకు దాసరి నారాయణ గారు అంటే ఎవరో కూడా ఈమెకు తెలియదని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. దాసరి గారి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు(Kalyana prapthirasthu) అనే సినిమాలో హీరోయిన్ గా నటించారని తెలుస్తోంది.
దాసరి గారికే కండిషన్లు..
ఇలా దాసరి నారాయణరావు గారి నుంచి పిలుపు వచ్చిందని తెలియడంతో తన తల్లితో కలిసి వెళ్లానని అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన ముందు దర్జాగా కూర్చొని సినిమా కథ ఏంటో చెప్పండి అంటూ నేనే ప్రశ్నించాను. అలాగే ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుంది? ఇలాగ ఉంటేనే చేస్తాను ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటాను అంటూ ఈమె దాసరి గారికి కండిషన్లు పెట్టారట. ఈమె కండిషన్లు విన్న దాసరి నారాయణరావు గారు నవ్వుతూ కండిషన్లకు ఒప్పుకున్నట్టు సుమా తెలిపారు.
యాంకర్ గా స్థిరపడిన సుమ…
ఇకపోతే సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత లొకేషన్ లోకి వెళ్ళగానే అక్కడ దాసరి నారాయణ రావు గారికి ఉన్న క్రేజ్ ఆయన పట్ల అందరూ చూపిస్తున్న గౌరవం చూసే ఒక్కసారిగా వణికిపోయానని, ఆయన దాసరి గారు అని తెలిసి వెంటనే ఆయన కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నానని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో సుమకు జోడిగా వక్కంతం వంశీ(Vakkantham Vamsi) హీరోగా నటించారు. ఇలా ఈ కాంబినేషన్లో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత సుమ ఇతర ఏ సినిమాలలోను హీరోయిన్గా నటించలేదు కానీ పలు సినిమాలలో అక్క పిన్ని పాత్రలలో నటించి సందడి చేశారు. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సుమ యాంకరింగ్ రంగంలో స్థిరపడిపోయారు.
Also Read: Rashmi Gautam: ఏదీ శాశ్వతం కాదు.. అభిమానులకు షాక్ ఇచ్చిన రష్మీ?