Ranveer Singh New Car : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈయన నటించిన సినిమాలు తెలుగులో రాలేదు కానీ తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో సుపరచితమే.. బాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొనే భర్తగా ఈయన అందరికీ తెలుసు.. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ లో ఈ జంట ఒకరు. బాలీవుడ్ లో ఈయన నటించిన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఈమధ్య భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు రణవీర్ సింగ్.. తాజాగా ఈయన గ్యారేజ్ లోకి మరో లగ్జరీ కారు వచ్చేసిందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్న కార్లలో ఇదే అత్యంత ఖరీదైన కారని సమాచారం. మరి ఆ కారు ఏ కంపెనీది? దాని ఫీచర్స్ ఏంటి? ధర ఎంత అన్న విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం..
ఖరీదైన కారును కొన్న రణవీర్ సింగ్..
బాలీవుడ్ హీరో రణవీర్ ఎప్పుడు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తుంటారు. ఆయన వాడే వస్తువుల నుంచి చెప్పులు వరకు అన్ని బ్రాండెడ్ వస్తువుల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారని తెలుస్తుంది. ఈమధ్య ఖరీదైన ఇల్లు కొన్న ఈయన తాజాగా కోట్లు విలువచేసే కారుని కొనుగోలు చేశారు.. ఆ కారు పేరు హమ్మర్ Ev. చాలా కాస్ట్లీ అండ్ లగ్జరీ కారు బ్రాండ్ ఇది.
దాదాపు 5 కోట్లకు పైగా ఉంటుంది దీని ప్రైజ్. ఈ కార్లు వరల్డ్ వైడ్ దాదాపు 1000 లోపే ఉన్నాయి. అందులో ఒకటి రణ్‌వీర్ దగ్గర ఉంది. ఇప్పటికే రణ్ వీర్ సింగ్ దగ్గర రేంజ్ రోవర్, లంబోర్గిని, ఆస్టన్ మార్టిన్, మెర్సిడెస్-బెంజ్, జాగ్వార్, ఆడి , టయోటా లాంటి కాస్ట్లీ అండ్ లగ్జరీ కార్లు ఉన్నాయి.. వీటితో పాటుగా ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి.
Also Read : శ్రీవల్లికి మరో ఛాన్స్… బన్నీ ఇప్పట్లో వదిలేలా లేడు
రణవీర్ సింగ్ మొత్తం ఆస్తులు..
ఈ హీరో బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుగా భారీ ప్రాజెక్టుల లో నటించారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.. కేవలం సినిమాలు మాత్రమే కాదు వాణిజ్య ప్రకటనలకు తో కూడా బాగానే సంపాదిస్తున్నారు. అంతేకాదు పలు వ్యాపారాలు కూడా చేస్తున్నారని తెలుస్తుంది. రణవీర్ సింగ్ మొత్తం ఆస్తులు రూ.362 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. 2019 లో అతని వార్షిక ఆదాయం రూ.21 కోట్లు. ఇప్పుడు అది గణనీయంగా పెరిగింది.. ఈయన కన్నా ఎక్కువ ఈయన భార్యకు బాగా పాపులారిటీ ఉంది. దీపిక పదుకొనే ఆస్తులతో పాటు ఆమె ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది..