Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని ఇండస్ట్రీలో సర్వత్ర ఒక ఆసక్తి నెలకొంది. అయితే తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరియర్ లో 22వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇందులో.. దీపిక పదుకునే హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 800 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ నిర్మిచబడుతుంది. ఈ మూవీలో ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఇది ఇప్పుడు నాలుగో హీరోయిన్ ను దింపబోతున్నట్లు సమాచారం.. రష్మిక మందన్న ను ఫిక్స్ చేసే అవకాశం ఉందని టాక్..
బన్నీ – రష్మిక కాంబో రిపీట్..
పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి తెరపై మళ్లీ మెరిపించబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ‘పుష్ప’ సిరీస్‌లో ‘శ్రీవల్లి’ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, బన్నీ సరసన ముచ్చటగా మూడోసారి నటించనున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మాస్ అండ్ హైటెక్ ఎంటర్టైనర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే కంప్లీట్ గా స్టేట్స్ మీదకి వెళ్లబోతుంది.. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. పుష్ప సిరీస్ సినిమాల్లో వీళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కాంబో కోసం వెయిట్ చేస్తుంటారు.. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని డైరెక్టర్ ఆమెను హీరోయిన్గా తీసుకురాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం..
Also Read : ఈ ఫోటోలోని హీరోని గుర్తు పట్టారా? అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..
అల్లు అర్జున్ మూవీలో ఆ 5 గురు హీరోయిన్లు..
అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మూవీ పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.. పుష్ప తర్వాత రాబోతున్న ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథ మాత్రమే హీరోయిన్లను కు పక్కా ప్లాన్ ప్రకారమే డైరెక్టర్ దించుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే మెయిన్ లీడ్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దీపికతో పాటు జాన్వి కపూర్, మృనాల్, రష్మిక మందాన, అలాగే భాగ్యశ్రీ నటించబోతున్నట్లు కొత్తగా తెరపైకి కొత్త చర్చ వచ్చింది. నలుగురు హీరోయిన్లు.. సెకండ్ హాఫ్ లో పరిచయం అవుతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.. అల్లు అర్జున్ ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపిస్తాడని తెలుస్తుంది..ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి తన మాస్ స్టామినా ప్రూవ్ చేసేందుకు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు..