Tips For Skin Glow: ప్రతి ఒక్కరూ తమ ముఖం అందంగా మెరుస్తూ ఉండాలని కలలు కంటారు. ముఖ్యంగా అమ్మాయిలు గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటాయి. అయినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో హోం రెమెడీస్ వాడటం మంచిది. ఇవి గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా వీటిని వాడటం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటి వాటిలో రోజ్ వాటర్ (Rose Water), విటమిన్ ఇ క్యాప్సూల్స్ (Vitamin E Capsules) అద్భుతమైన కలయిక. ఈ రెండింటినీ కలిపి ముఖానికి వాడటం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతే కాకుండా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
రోజ్ వాటర్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఎందుకు కలిపి వాడాలి ?
రోజ్ వాటర్ అనేది దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీసెప్టిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా అవసరం అయిన తేమను కూడా అందిస్తుంది. సున్నితమైన చర్మానికి కూడా ఇది చాలా అనుకూలం.
విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఇవి అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి. విటమిన్ ఇ చర్మ కణాలను పునరుద్ధరించడంలో.. అంతే కాకుండా మచ్చలను తగ్గించడంలో, చర్మానికి తేమ అందించడంలో సహాయపడుతుంది.
ఈ రెండింటినీ కలిపి వాడటం వల్ల వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి.
రోజ్ వాటర్ , విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మం మృదువుగా, తేమగా మారుతుంది: రోజ్ వాటర్ చర్మానికి తక్షణ తేమను అందిస్తుంది. అంతే కాకుండా విటమిన్ ఇ చర్మం లోపల తేమను బంధించి, పొడిబారకుండా చేస్తుంది. ఈ రెండూ కలిపి చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మార్చుతాయి.
మచ్చలు, నల్ల మచ్చలు తగ్గుతాయి: విటమిన్ ఇ చర్మ కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది మొటిమల మచ్చలు, నల్ల మచ్చలు, సూర్యరశ్మి వల్ల ఏర్పడిన మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజ్ వాటర్ చర్మ రంగును మెరుగుపరుస్తుంది.
యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు: విటమిన్ ఇలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయిజ తద్వారా సన్నని గీతలు ముడతలు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. రోజ్ వాటర్ చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.
Also Read: హెయిర్ ఆయిల్స్‌తో మ్యాజిక్.. జుట్టును ధృడంగా చేయడంలో వీటిని మించినవి లేవు
మంట, ఎరుపుదనం తగ్గుతుంది: రోజ్ వాటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల , మొటిమలు లేదా ఇతర చికాకుల వల్ల కలిగే ఎరుపుదనం, మంటను తగ్గిస్తుంది. సున్నితమైన లేదా మొటిమలు వచ్చే చర్మానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
చర్మ రంగు మెరుగుపడుతుంది: ఈ మిశ్రమం చర్మంలోని మలినాలను తొలగించి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చర్మానికి సహజమైన కాంతినిచ్చి, రంగును మెరుగుపరుస్తుంది.
సన్‌బర్న్ నుంచి ఉపశమనం: ఎండకు కమిలిన చర్మానికి రోజ్ వాటర్, విటమిన్ ఇ మిశ్రమం ఉపశమనాన్ని ఇస్తుంది. విటమిన్ ఇ దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది.