E-Paper
Advertisement

వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్నారా? తాగే ముందు తప్పనిసరిగా ఈ 5 విషయాలు చెక్ చేయండి

వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తున్నారా? తాగే ముందు తప్పనిసరిగా ఈ 5 విషయాలు చెక్ చేయండి
Advertisement

వేసవికాలం అయినా, వర్షాకాలం అయినా చాలా మంది బాటిల్ వాటర్ తాగే అలవాటు చేసుకుంటున్నారు. కొనుగోలు చేస్తుంటారు. అయితే తొందరపాటులో కనిపించిన మొదటి బాటిల్‌నే కొనేయడం సరైన నిర్ణయం కాదు. చిన్న నిర్లక్ష్యం కూడా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే బాటిల్ వాటర్ కొనుగోలు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పకుండా పరిశీలించాలి. కొన్ని నిమిషాల జాగ్రత్త మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ముందుగా బాటిల్ సీల్‌ను పరిశీలించండి

వాటర్ బాటిల్ కొనుగోలు చేసే ముందు క్యాప్ సరిగా సీల్ అయిందో లేదో చూడాలి. సీల్ తెగిపోయి ఉంటే లేదా క్యాప్ లూజ్‌గా కనిపిస్తే ఆ బాటిల్ కొనకపోవడం మంచిది. ఇప్పటికే తెరిచినట్లుగా అనిపించే బాటిల్‌ను కూడా ఉపయోగించకూడదు. సీల్ దెబ్బతిన్న బాటిల్‌లో నీళ్ల క్వాలిటీపై సందేహం కలుగుంది.

లేబుల్‌ జాగ్రత్తగా చదవండి

Advertisement

మార్కెట్‌లో ప్రముఖ బ్రాండ్ల పేర్లను పోలి ఉండే నకిలీ ఉత్పత్తులు కూడా లభిస్తాయి. అందుకే బ్రాండ్ పేరు, స్పెల్లింగ్, లోగోను జాగ్రత్తగా పరిశీలించాలి. లేబుల్‌పై ప్రింటింగ్ స్పష్టంగా ఉండాలి. ప్యాకింగ్ క్వాలిటీ కూడా శుభ్రంగా, ప్రొఫెషనల్‌గా కనిపించాలి. సందేహాస్పదంగా అనిపిస్తే ఆ బాటిల్‌ను కొనకపోవడం మంచిది.

తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్ చెక్ చేయాలి

బాటిల్‌పై ముద్రించిన తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా చదవాలి. ఎక్స్‌పైరీ ముగిసిన బాటిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదు. అలాగే చాలా కాలం నిల్వలో ఉన్న ఉత్పత్తులను కూడా వీలైనంత వరకు నివారించాలి. తాజాగా తయారైన ప్రొడక్ట్స్‌ని ఎంచుకోవడమే సురక్షితం.

ఐసిఐ, FSSAI గుర్తులు చెక్ చేయండి

Advertisement

భారతదేశంలో విక్రయించే ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్‌పై ఐఎస్ఐ గుర్తు, FSSAI లైసెన్స్ నంబర్ ఉండాలి. ఈ గుర్తులు ఉత్పత్తి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తాయి. ఈ వివరాలు లేని బాటిల్స్ కొనకుండా ఉండడం మంచిది.

నీళ్ల క్వాలిటీని కూడా పరిశీలించండి

బాటిల్‌ వెలుతురు వైపు పట్టుకుని నీళ్లని పరిశీలించండి. నీరు పూర్తిగా పారదర్శకంగా, రంగులేకుండా ఉండాలి. అందులో దుమ్ము, తేలియాడే కణాలు లేదా మసక మసకగా కనిపించకూడదు. అలాంటి లక్షణాలు ఉంటే ఆ బాటిల్స్ తీసుకోకూడదు.

నమ్మకమైన షాపులను నుంచే కొనండి

వీలైనంత వరకు మీకు విశ్వసనీయమైన షాపుల నుంచే బాటిల్ వాటర్ కొనుగోలు చేయాలి. ఎండలో ఎక్కువసేపు ఉంచిన బాటిళ్లను కొనకుండా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలు ప్లాస్టిక్ బాటిల్‌తో పాటు నీళ్ల నాణ్యతను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Also Read: మీ పిల్లాడు ప్రతిరోజు ప్లేట్‌లో భోజనం మిగిల్చేస్తున్నాడా? ఆహారం వ్యర్థం చేయకూడదని ఇలా నేర్పించండి

బాటిల్‌ను సరైన విధంగా నిల్వ చేయండి

కొన్న తర్వాత బాటిల్‌ను చల్లని, పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. వాహనాల్లో ఎక్కువసేపు వేడి వాతావరణంలో ఉంచకూడదు. బాటిల్ తెరిచిన తర్వాత వీలైనంత త్వరగా నీళ్లు తాగడం మంచిది. ప్రతి సారి ఉపయోగించిన తర్వాత మూతను బిగిగా మూసివేయాలి.

ఆరోగ్యానికి నాణ్యతే ముఖ్యం

బాటిల్ వాటర్ కొనేటప్పుడు ధర మాత్రమే కాకుండా దాని నాణ్యత, భద్రత కూడా ముఖ్యమే. సరిగా పరిశీలించడం కొనడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్యాన్ని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి సారి బాటిల్ వాటర్ కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను తప్పకుండా పాటించండి.

Related News

వర్షంలో పూర్తిగా తడిసిపోయారా? వెంటనే ఈ పనులు చేయకపోతే ఆరోగ్యానికి ప్రమాదకరం

స్కిన్‌కేర్‌ సంబంధించిన 7 అపోహలు.. మెరిసిపోయే ఆరోగ్యమైన చర్మం కోసం ఫ్యాక్ట్ చెక్ చేయండి

మైదా లేకుండానే క్రిస్పీ పేపర్ సమోసా.. హెల్తీ స్నాక్ ఇంట్లోనే సులభంగా చేసే రెసిపీ

వాషింగ్ మెషీన్‌లో వెనిగర్ వేస్తే ఏమౌతుందో తెలుసా? ఇన్నాళ్లూ ఈ సూపర్ ట్రిక్ తెలియక నష్టపోయాం!

వైన్ బాటిల్స్ ఎప్పుడూ 750ml ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న క్రేజీ హిస్టరీ తెలిస్తే..

కష్టపడి రుద్దాల్సిన పనిలేదు.. ఈ 5 పదార్థాలతో వంటగది జిడ్డు చిటికెలో మాయం!

వెరైటీగా ఆ దేశ ప్రజల అలవాట్లు.. కేవలం రాత్రి వేళ మాత్రమే, అందుకేనా 90 ఏళ్లు ప్లస్

Big Stories

Advertisement
×