Rashmika Mandanna:నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వరుస సినిమాలు చేస్తూ.. ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ప్రతి సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటున్న ఈమె.. నటిస్తే చాలు మినిమం గ్యారంటీ అనే రేంజ్ లో నిర్మాతలు కూడా ఫిక్స్ అవుతున్నారు.అందుకే ఈమెతో సినిమా చేయడానికి మేకర్స్ పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో రష్మిక మందన్న లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ శెట్టి ఇందులో హీరోగా నటిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీన కన్నడ , తమిళ్, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ట్రైలర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు సినిమా నటీనటులే కాకుండా.. నిర్మాతలు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటూ చిత్రంపై ఊహించని అంచనాలు పెంచేస్తున్నారు. అందులో భాగంగానే రష్మిక రెమ్యూనరేషన్ గురించి ఈ చిత్రం నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజా ఇంటర్వ్యూలో తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. సినిమా పై కొన్ని విషయాలు పంచుకున్న ఆయన రష్మిక గురించి మాట్లాడుతూ..” ఈ సినిమా కోసం రష్మికకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఆమె మేనేజర్ ని కలిస్తే.. గత కొన్ని రోజులుగా ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో నేరుగా రష్మికను కలిసాము. ముందు సినిమా విడుదల కానివ్వండి ఆ తర్వాత చూద్దాము అని చెప్పింది. దాంతో ఆమెపై మాకు రెస్పెక్ట్ మరింత పెరిగిపోయింది.ఆమె ఈ సినిమాకు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు కానీ ఆమెపై ఉన్న కృతజ్ఞతతో ఆమెకు మేము రెట్టింపు రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాము అంటూ మొగిలినేని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే రష్మిక మంచి మనసు ఇప్పుడు ఆమెకు జాక్పాట్ కొట్టేలా చేసింది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో డబుల్ రెమ్యూనరేషన్ తీసుకోబోతోంది అని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Bigg Boss 9 Promo: తనూజకు గట్టిగా ఇచ్చిపడేసిన కింగ్.. ఇకనైనా మారుతుందా?
గతంలో పుష్ప, పుష్ప2, యానిమల్, ఛావా, కుబేర, థామా అంటూ వరుస పెట్టి సినిమాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన్న. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత మైసా , రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది.ఇదిలా ఉండగా మరొకవైపు తాను ప్రేమించిన విజయ్ దేవరకొండ తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న ఈమె వచ్చే యేడాది ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతోందని సమాచారం. మరి పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేక ఇంటికే పరిమితమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది.