Rashmika Mandanna: రష్మిక మందన్న (Rashmika Mandanna).. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ‘ఛలో’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రష్మిక మందన్న.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని, స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు(Mahesh Babu) తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అభిమానుల హృదయాలు దోచుకున్న ఈమె.. ఆ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) తో ‘పుష్ప’ సినిమా చేసి.. ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. దీనికి తోడు ‘పుష్ప 2’ సినిమాతో సంచలనం సృష్టించింది. అటు డాన్స్ పరంగా, ఇటు నటనాపరంగా అందరి దృష్టిని ఆకట్టుకుంది రష్మిక.
ఆ 4 చిత్రాలపై రష్మిక కీలక వ్యాఖ్యలు..
ఇక తర్వాత వరుసగా యానిమల్, ఛావా వంటి సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది రష్మిక. అంతేకాదు ఈ సినిమాలతో మూడేళ్లలోనే రూ.3000 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. అటు ఏ స్టార్ హీరో కానీ ఏ స్టార్ హీరోయిన్ కానీ ఈ రేంజ్ లో రికార్డు క్రియేట్ చేయలేదు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఈ సినిమాలలో నటించడంపై పలు ఆసక్తికర కామెంట్లు పంచుకుంది. ఈ మేరకు రష్మిక తన అనుభవాలను ఏ విధంగా తెలియజేసిందో ఇప్పుడు చూద్దాం.
ఆ బాధ భరించలేక నరకం చూసా – రష్మిక మందన్న
తాజాగా రష్మిక ఒక బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొని తాను నటించిన సినిమాల గురించి మాట్లాడింది. అందులో భాగంగా తమిళ్ లో విజయ్ దళపతి(Vijay Thalapathi) తో కలిసి నటించిన చిత్రం ‘వారసుడు’ గురించి ఆమె మాట్లాడుతూ.. “విజయ్ తో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషించాను. ఆ సినిమా షూటింగ్ సెట్లో కూడా ఎన్నో మధురానుభూతులు మిగిలాయి” అంటూ తెలిపింది. “అలాగే పుష్ప 2 సినిమా షూటింగ్ చివరి రోజున భావోద్వేగానికి గురయ్యాను.. సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే చిత్ర బృందాన్ని వీడి వెళుతున్నప్పుడు నరకం అనుభవించాను” అంటూ తెలిపింది.
వారితో అనుభవం మరువలేనిది – రష్మిక మందన్న
ఇక ‘యానిమల్’ సినిమా గురించి మాట్లాడుతూ.. రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) తో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయారు. అటు విక్కీ కౌశల్ (Vicky Kaushal)తో కలిసి నటించిన ‘ఛావా’ షూటింగ్లో ఎప్పుడూ కూడా కష్టం అనిపించలేదు అంటూ తెలిపింది. మొత్తానికైతే ఈ నాలుగు చిత్రాల అనుభవాలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంది రష్మిక మందన్న. ఇక ఈ సినిమా కలెక్షన్లు కాదు ఈ సినిమా నటీనటులతో అనుభవాలు, వారి నుండి విడిపోతున్నప్పుడు కలిగిన బాధ తనను మరింత దుఃఖానికి గురిచేసింది అంటూ కూడా చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Bigg Boss 9: ఒక్క ఛాన్స్ అంటూ నాగ్ ను వేడుకుంటున్న మహిళ.. కరుణిస్తారా?