Amaravati: ఒకరేమో అమరావతిని.. వేశ్యల రాజధాని అంటారు.. ఇంకొకరేమో.. చేపలు పెంచుకోవడానికి తప్ప.. ఇంకెందుకూ పనికిరాదంటారు. అసలు.. అమరావతి అంటే ఎందుకింత అక్కసు? ఇది మెజారిటీ ఏపీ ప్రజల్లో మెదులుతున్న మేజర్ క్వశ్చన్. ఉన్నట్టుండి.. ఇప్పుడెందుకొచ్చింది ఈ ప్రశ్న అంటారా? ఉంది.. ప్రతిదానీకి ఓ లెక్క ఉన్నట్లే.. దీని వెనుకా ఓ వివాదం ఉంది. అమరావతిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయ్.
అమరావతిలో ఉండేది అక్వా వ్యాలీ మత్రమే..
ప్రతీది.. తానే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీ అంటున్నారని.. అక్కడ ఏ వ్యాలీ ఉండదని అన్నారు. అమరావతిలో ఉండేది ఆక్వా వ్యాలీ మాత్రమేనని చెప్పారు. చేప పిల్లల్ని తీసుకొచ్చి అమరావతిలో పెంచితే.. మంచి ఫలితాలు ఉంటాయని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. అంతకుమించి అమరావతిలో ఏం చేసినా పురోగతి ఉండదన్న కేతిరెడ్డి.. ఒక్క ఫిషరీస్‌కు మాత్రమే ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంపై.. రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే.. కొత్త యాపారం మొదలెట్టావా కేతి అని ఎద్దేవా చేస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి.. కూటమి సర్కార్ లక్ష్యం
గత ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి పనులు.. ఇప్పుడు వేగంగా సాగుతున్నాయి. కీలకమైన ప్రాజెక్టులను.. మూడేళ్లలోపే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి.. ఇవి పూర్తి చేయాలని కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు.. మినిస్టర్ క్వార్టర్స్, జడ్జిల బంగ్లాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.
8 వేల కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం..
రాయపూడిలో.. 115 ప్రిన్సిపల్ సెక్రటరీ, వివిధ శాఖల సెక్రటరీల బంగళాల పునర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మిగిలిన ప్రభుత్వ భవనాలన్నింటిని.. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు.. రాజధానిలో రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై సిస్టమ్, యుటిలిటీ డక్ట్‌లు, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌ల లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి.. సీఆర్డీయే టెండర్లు కూడా ఖరారు చేసింది. దాదాపు 38 వేల కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం కూడా తెలిపింది. ఇప్పటికే.. రాజధాని ప్రాంతంలో 72 సంస్థలకు భూముల్ని కేటాయించారు. చాలా సంస్థలు.. వచ్చే డిసెంబర్ నాటికి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read: అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్?
కేతిరెడ్డి వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత వాసుల్లో ఆగ్రహం
మొత్తంగా.. వైసీపీ హయాంలో నిలిచిన అమరావతి పనులు.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఊపందుకున్నాయ్. మూడేళ్లలో.. క్యాపిటల్ సిటీకి ఓ రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం.. నిర్మాణ సంస్థలకు.. సర్కార్ డెడ్ లైన్లు కూడా విధించింది. మంత్రులు కూడా తరచుగా రాజధాని నిర్మాణ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత వాసుల్లో ఆగ్రహం తెప్పిస్తున్నాయ్. నిజానికి.. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం.. 3 రాజధానుల అంశమే. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అనే దానికే.. మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారు. అందుకు అనుగుణంగానే.. అమరావతి పనులు స్పీడప్ చేసింది సర్కార్. అలాంటి.. రాజధానిపై.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే దానిమీదే.. చర్చ మొదలైంది.