Intinti Ramayanam Today Episode july 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో అవనిని గట్టిగా పిలుస్తుంది పార్వతి.. అత్తయ్య గారు మీరేంటి ఇలా వచ్చారు అని అవని అంటుంది. మీ మావయ్యతో నేను షష్టిపూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు మీ తమ్ముడు ప్రణతి అందరూ కలిసి రావాలి అని పిలుస్తుంది. మీరు ఇంతగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం అత్తయ్య కచ్చితంగా వస్తాము అని అవని అంటుంది. ఇదంతా చేసుకునేది నా కూతురు కోసమే అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్షయ్ దగ్గరికి వెళ్లిన పార్వతి రేపే కదా ఫంక్షన్ వెళ్దాం పదండి అని అంటుంది. భానుమతి ఫంక్షన్ రేపే కదా నేను మీతో పాటు రావడానికి బ్యాగు సర్దుకున్నాను అని అంటుంది.
అక్షయ్ మాత్రం నేను ఆ ఇంటికి రానని తెలుసు కదా.. ఏదైనా ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ పెట్టుకోవచ్చు కదా అని అంటాడు.. పార్వతి దానికి బడ్జెట్ లేదు కదరా అందుకే అలా చేశాము రేపు నువ్వు తప్పకుండా రావాలని పార్వతి పిలుస్తుంది.. అక్షయ్ అవనిల మధ్య దూరం పెరిగేలా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..కమల్ అన్నట్లే కాసేపట్లో భానుమతి ఎదురుగా కమలాకర్ వచ్చి నిలబడతాడు. అక్షయ అవనీల గురించి అడిగి ఒళ్ళు వాయించేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసేలా చేయమని చెప్పాను కదా మరి దూర దూరంగా ఉన్నారు అంటావేంటి అని దారుణంగా కొట్టేస్తాడు. అక్షయ దగ్గరికి ఆరాధ్య వచ్చి అమ్మానాన్న కూడా దండలు మార్చుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నాన్న అని అంటుంది. ఆ మాట వినగానే అక్షయ్ అవని పై సీరియస్ అవుతాడు.
నువ్వు నాతో మాట్లాడే దైర్యం లేక చిన్నపిల్ల చేత చెప్పిస్తావా..? ఆ పిల్ల ఏమంటుందో తెలుసా ఈ వయసులోనే అన్ని మాటలు ఎలా వచ్చాయి నువ్వు నేర్పించినవే కదా అని అక్షయ్ సీరియస్ అవుతాడు. చిన్నపిల్లల చేత చెప్పించే అంత మూర్ఖురాలిని నేనైతే కాదు. నువ్వు కచ్చితంగా ఏది అనుకుంటే అది చేసే చూపిస్తాను. ఆ ధైర్యం నాకుంది. ఆరాధ్య కోసం మీరు కోర్టుకెళ్లినట్టు నేను కూడా కోర్టుకెళ్ళి ఉండేదాన్ని..
ఇదంతా కాదు మీరు నాకు చేసిన అన్యాయానికి 10 మంది పెద్ద మనుషులు పిలిపించి ఖచ్చితంగా న్యాయం చేయాలని అడిగి ఉండేదాన్ని. కేవలం నాకు కుటుంబం కలిసి ఉండాలని ఉద్దేశంతోనే దూరంగా ఉంటున్నాను.. మీరు గుర్తుంచుకుంటే మంచిది అని అవని అంటుంది.. పల్లవి చక్రధర చెప్పినట్లు పెళ్లి సంబంధం వాళ్ళు ఇంకా ఫోన్ చేయలేదేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే పెళ్లి వాళ్ళు ఫోన్ చేసి పెద్దవాళ్ళకి ఇవ్వమని అడుగుతారు.. పల్లవి మా అత్తయ్య గారు ఉన్నారండి ఇస్తాను అని ఇస్తుంది..
పార్వతి వాళ్లతో మాట్లాడుతుంది. ప్రణతి బాగా నచ్చిందంట. పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది. కానీ గతంలో ప్రణతికి జరిగింది వాళ్ళకి తెలిస్తే అభిప్రాయాలు మారిపోతాయేమో అని నాకు భయమేస్తుంది అని పార్వతి అంటుంది.. దానికి పల్లవి మీరు అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు అత్తయ్య మా డాడీ ఎంత చెప్తే అంతే అంటా.. నువ్వు ఎంత చెప్తున్నా కూడా వచ్చిన సంబంధం చెడిపోయిందంటే చాలా బాధపడాల్సి వస్తుంది అని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇక మా డాడీ కి కాల్ చేసి చెప్తాను మీరే మాట్లాడండి అని పల్లవి అంటుంది..
మరి ఎవరికి చక్రధర్ పల్లవి తో మాట్లాడి పార్వతికి ఇవ్వమని అంటాడు.. నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు అమ్మ ఆ పెళ్లి సవ్యంగా జరుగుతుంది మేం కూడా అక్కడికి వస్తాం కదా అని భరోసా ఇస్తాడు. సంబంధం గనక ఓకే అయితే అవని నీ శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేయొచ్చని పల్లవి అనుకుంటుంది. ఇక అక్షయ్ అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు కానీ అమ్మ రమ్మనిందని వెళ్లాల్సి వస్తుందిఅని అనుకుంటాడు. అటు అవని మా అత్తయ్య మావయ్య జరగాలి. ప్రణతి, భరత్పెళ్లి గురించి అత్తయ్య ఒప్పుకునేలా మీరే చేయాలి అని దేవుడికి దండం.
ప్రణతి భరత్ కోసం ఒక షర్ట్ ని ఇస్తుంది.. మా వదిన మన పెళ్లి గురించి చెప్తాననింది కదా అక్కడ అందరిలో నువ్వు బాగా కనిపించాలి అని అంటుంది. మాట వినగానే భరత్ సంతోషిస్తాడు.. అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు దయాకర్ స్వరాజ్యంను పిలిస్తే మేము ఇప్పుడు రాలేము మీ అత్తయ్య పిలిచి ఉంటే వచ్చేవాళ్ళమేమో. మేం మాంతట మేము వచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. మీరు వెళ్లి సంతోషంగా ఫంక్షన్ చేసి రండి అని అంటుంది. షష్ఠి పూర్తికి అత్తయ్య మామయ్యలకు పెద్ద కొడుకు కోడలు బట్టలు పెట్టాలి. నేను ఆయన వెళ్లి షాపింగ్ చేసి వస్తామని అంటుంది.
అక్షయ మాత్రం నేను రాను నువ్వే వెళ్ళు అనేసి అంటాడు. మీకు బట్టలు పెట్టడం ఆయనకి ఇష్టం లేనట్టుంది ఇక ఫంక్షన్కి ఏమొస్తారు మామయ్య అని అవని అంటుంది. నేను వస్తాను అని అక్షయ్ అంటాడు.. అటు పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు ఫంక్షన్ అయిపోయేంతవరకు పెళ్లి సంబంధం గురించి ఎవరికీ చెప్పకండి అవని గురించి మీకు తెలుసు కదా? నాకు మాట ఇవ్వండి అని పల్లవి అడుగుతుంది.. పార్వతి పల్లవి కోరిక మేరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను అంటుంది.
Also Read: సంజయ్ కు బాలు కౌంటర్.. పెళ్లాల పై చర్చ.. శృతి స్పీడుకు ప్రభావతి షాక్..
ప్రణతి ఇంకా రెడీ అవ్వలేదు ఏంటి ఫంక్షన్ కి రావట్లేదా అని అడుగుతుంది.. నాకు అక్కడికి రావాలంటే భయంగా ఉంది వదిన. అందుకే రెడీ అవ్వలేదు అని అంటుంది. నాకు అందరి మీద కన్నా నీ మీద నమ్మకం ఎక్కువ వదినా.. నాకు భరత్ నుంచి పెళ్లి చేస్తానని మాటీవీ వదిన అని అడుగుతుంది. అవని మాటిస్తున్నాను కచ్చితంగా మీ పెళ్లి జరుగుతుంది అని అంటుంది. అందరూ కలిసి క్యాబ్లో వెళ్తారు. అయితే అక్షయ్ మాత్రం.. నేను మీతో వస్తానని అనుకోవద్దు. నేను వేరేగా వస్తాను మీరు వెళ్ళండి అని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…