Rashmika: సినీ నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె ది గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నేడు మరో కొత్త సినిమా మైసా (Mysaa)పూజ కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
వేచి ఉండలేను..
ఇకపోతే తాజాగా ఈమె నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన కింగ్ డం(King Dom) సినిమా విడుదల గురించి అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ గురించి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ గురించి ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ..”ఓహ్‌హూ!!! ఇదేమి ట్రైలర్ పిచ్చెక్కిస్తోంది. ఈ అద్భుతమైన ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా నాలుగు రోజులు వేచి ఉండాలి అంటే సాధ్యం కాదని తెలిపారు. విజయ్ దేవరకొండ నేను నీకు ఎప్పుడు ఒక విషయం చెబుతుంటాను నువ్వు ఎంతో ప్రత్యేకం.. నేనెప్పుడూ కోరుకునేది ఒకటే నువ్వు చేసే నటనలో నేను 50 శాతం చేయాలని కోరుకుంటున్నాను” అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ ట్రైలర్ గురించి విజయ్ దేవరకొండ నటన గురించి ప్రశంసలు కురిపించారు.
ముగ్గురు మేధావులు…
ఇక రష్మిక ఎక్స్ వేదికగా కూడా ఈ సినిమా విడుదల గురించి స్పందించారు. ఈ సందర్భంగా రష్మిక ట్వీట్ చేస్తూ.. “నేను జూలై 31వ తేదీ వరకు వేచి ఉండలేకపోతున్నాను. విజయ్ దేవరకొండ, అనిరుద్, గౌతమ్ ఈ ముగ్గురు మేధావులు కలిసి ఏమి సృష్టించారు చూడటానికి ఎదురు చూడలేకపోతున్నాను” అంటూ ఈమె ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. రష్మిక ఇలా ఎక్స్ వేదికగా ఈ సినిమా గురించి ట్వీట్ వేయడంతో వెంటనే విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. “రషీలు అంటూ హార్ట్ సింబల్ జోడిస్తూ కచ్చితంగా కింగ్ డం ఎంజాయ్ చేస్తారు” అంటూ తన ముద్దు పేరుతో రిప్లై ఇవ్వడంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
I can’t wait for the 31st now!
We can see the fire @TheDeverakonda 🌸🩷
You three geniuses!!
I am very very curious to see what you guys have created together.. @gowtam19 @anirudhofficial ❤️❤️
can’t waittttt!!!!!!#KingdomOnJuly31st – let’s gooooo!🔥💃🏻 https://t.co/OXBNNHTOvp— Rashmika Mandanna (@iamRashmika) July 27, 2025
ఇలా రష్మిక విజయ్ దేవరకొండ సినిమా గురించి ఇంస్టాగ్రామ్, ఎక్స్ వేదికగా స్పందిస్తూ పోస్టులు చేయడంతో మరోసారి వీరిద్దరి డేటింగ్ రూమర్స్ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా తన గర్ల్ ఫ్రెండ్ తో సమయం గడపలేక పోతున్నానని పరోక్షంగా వీరి రిలేషన్ గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి రష్మిక కూడా కింగ్డమ్ సినిమా గురించి వరుస పోస్టులు చేయడంతో మరోసారి వీరి రిలేషన్ పై చర్చలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ రిలేషన్ లో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయలేదు అంటూ అభిమానులు భావిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Ponnambalam: నాలుగేళ్లలో 750 ఇంజక్షన్లు.. పగవాడికి కూడ ఈ బాధ వద్దంటున్న నటుడు!