Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే.. పాన్ ఇండియా నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. వరుస సక్సెస్ లతో ఊహించని ఇమేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కానీ స్టార్ హీరోయిన్ కానీ ఈ రేంజ్ సక్సెస్ చూడలేదు అని చెప్పవచ్చు. కేవలం మూడు సంవత్సరాల లోనే ఈమె నటించిన వరుస చిత్రాలతో ఏకంగా రూ.3500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటింది. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ.. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న రష్మికకి ఇప్పుడు సక్సెస్ మింగుడు పడడం లేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రష్మిక కి సక్సెస్ మింగుడు పడడం లేదా..
దీనికి కారణం ఈమె ఎంచుకుంటున్న కథలే అని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు వరుస చిత్రాలలో హీరోయిన్ గా నటించి అలసిపోయిందేమో.. అందుకే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అని చూస్తోంది కాబోలు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెళ్తే.. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర అంటూ సౌత్ నుంచి నార్త్ వరకు ఇలా వరుస చిత్రాలతో వరుసగా సక్సెస్ అందుకొని మంచి స్టార్డం ను సొంతం చేసుకుంది రష్మిక. హీరోయిన్ గా భారీ సక్సెస్ అందుకున్న ఈమె ఇప్పుడు తాజాగా యూటర్న్ తీసుకుంది. అందులో భాగంగానే వరుసగా హార్రర్ చిత్రాలను ప్రకటిస్తూ అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
యూటర్న్ లో సక్సెస్ చవిచూస్తుందా?
ప్రస్తుతం రష్మిక లైనప్ విషయానికి వస్తే.. ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో వంటి చిత్రాలతో పాటు తాజాగా ఈ దీపావళికి థామా సినిమాతో బాక్సాఫీస్ బరిలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ హార్రర్ ప్రేమ కథ చిత్రం అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. హార్రర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పెరగగా.. అంతలోనే మరో హార్రర్ కాన్సెప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. హిట్ హార్రర్ ఫ్రాంఛైజీ లో రష్మిక భాగం కాబోతోందని సమాచారం. కాంచన సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కాంచన 4 ను సిద్ధం చేస్తున్నారు. తాను హీరోగా నటిస్తూనే.. స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నోరా ఫతేహీ (Nora fatehi), పూజా హెగ్డే (Pooja Hegde) ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఒక కీలకమైన పాత్ర కోసం రష్మికను రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రష్మికను ఈ విషయంపై సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
బెడిసి కొడితే పరిస్థితి ఏంటి?
ఇలా వరుసగా హార్రర్ ఓరియంటెడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడు చేయని సరికొత్త జానర్ ను రష్మిక ఎంపిక చేసుకుంది. ఒకవేళ సక్సెస్ అయితే ఓకే..బెడిసి కొడితే ఆమె పరిస్థితి ఏంటి? కెరియర్ ఏ వైపుకు మలుపు తిరుగుతుంది? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.