BigTV English

Film industry: చిత్ర నిర్మాత కన్నుమూత!

Film industry: చిత్ర నిర్మాత కన్నుమూత!

Film industry: గత 2 రోజులుగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరి మరణం మరవకముందే ఇంకొకరి మరణం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ప్రముఖ టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh) తల్లి అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) స్వర్గస్తులయ్యారు. కాసేపటి క్రితం ప్రముఖ మరాఠీ సీరియల్స్ నటి ప్రియా మరాఠే మోఘే క్యాన్సర్ తో అతి చిన్న వయసులోనే తుది శ్వాస విడిచారు. ఇక ఈ రెండు మరణాలు మరువకముందే ఇప్పుడు మరొక నిర్మాత మరణం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. అటు సెలబ్రిటీలు కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ప్రముఖ నిర్మాత కన్నుమూత..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ చిత్ర నిర్మాత రామానంద్ సాగర్ (Ramanandh Sagar) కుమారుడు నిర్మాత ప్రేమ్ సాగర్ (Prem Sagar)కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స అందుకున్నారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న ఈయన.. ఈరోజు ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రేమ్ సాగర్ సీనియర్ నిర్మాత మాత్రమే కాదు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కూడా.. తన తండ్రి రామానంద్ సాగర్ స్థాపించిన నిర్మాణ సంస్థ సాగర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలోని అనేక ప్రాజెక్టులకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.


ప్రేమ్ సాగర్ సీనియర్..

ఈయన కెరియర్ విషయానికి వస్తే.. రామాయణం అనే ఐకానిక్ టీవీ సీరియల్స్ ను సృష్టించిన రామానంద్ సాగర్ కుమారుడిగా ప్రేమ్ సాగర్ కథలు, సినిమా, భక్తితో ముడిపడిన వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి ఇంటి పేరును తన పేరుగా మార్చుకున్నప్పటికీ ప్రేమ్ సాగర్ మాత్రం కెమెరా వెనుకే ఉండడానికి ఇష్టపడ్డారు. అలా సినిమాటోగ్రాఫర్ గా సినిమాలకు పని చేస్తూ తన కెరీర్ ను కొనసాగించారు. ఈయన విక్రమ్ ఔర్ బేతాల్, రామాయణం, శ్రీకృష్ణ వంటి టెలివిజన్ షోలకు నాయకత్వం వహించడమే కాకుండా ధర్మేంద్ర, హేమమాలిని నటించిన లాల్కర్, చరస్, ఆంఖేన్ వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

దర్శకుడిగా కూడా ప్రయాణం..

ఇకపోతే ఈయన దర్శకుడిగా కూడా పలు చిత్రాలకు పనిచేశారు. ముఖ్యంగా జీతేంద్ర, హేమమాలిని కాంబినేషన్లో వచ్చిన ‘హమ్ తేరే ఆషిక్ హై’ అనే చిత్రానికి కూడా ప్రేమ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని ఆయన నిర్మించారు కూడా. అలా బాలీవుడ్ లో వరుస సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న ప్రేమ్ సాగర్.. నేడు మరణించడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు.

ALSO READ:Nani: నోరు విప్పాలంటేనే భయం వేస్తోంది..నానిని అంతలా బాధపెట్టిన సంఘటన ఏంటబ్బా?

Related News

Tamannaah Bhatia: మరోనటితో మాజీ ప్రియుడు విజయ్‌ వర్మ.. తమన్నా రియాక్షన్‌ చూశారా?

Mohan Sri Vathsa: తనను తాను చెప్పుతో కొట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ అదిరిపోయే అప్‌డేట్‌.. పవన్‌ లుక్‌ చూశారా.. ఇక మాస్‌ జాతరే..

The Paradise: గ్లోబల్ రేంజ్ లో నాని ది ప్యారడైజ్.. రంగంలోకి హాలీవుడ్?

Ghaati Pre Release: ఘాటీ ప్రమోషన్లకు అనుష్క అవసరం లేదు…  క్రిష్ షాకింగ్ కామెంట్స్!

Krish -HHVM: వీరమల్లు నుంచి అందుకే తప్పుకున్నా… ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన క్రిష్!

Big Stories

×