BigTV English

New Railway Station: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ప్రారంభం ఎప్పుడంటే?

New Railway Station: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ప్రారంభం ఎప్పుడంటే?

New Railway Station in TG: తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దుతోంది కేంద్ర ప్రభుత్వం. అమృత్ స్టేషన్ లో భాగంగా ఇప్పటికే పలు స్టేషన్లు పునర్నిర్మాణం కాగా, మరికొన్ని రైల్వే స్టేషన్ల పనులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఓ కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభానికి రెడీ అవుతోంది. ఇప్పటికే దాదాపు పనులు పూర్తి కావచ్చాయి. ఈమేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొత్త రైల్వే స్టేషన్ కు సంబంధించిన ఫోటోలు, పనుల పురోగతికి సంబంధించిన విషయాలను వెల్లడించారు.


కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం ఎక్కడంటే?

తెలంగాణ కొత్త రైల్వే స్టేషన్ సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో నిర్మాణం అవుతోంది. త్వరలోనే ఈ  హాల్ట్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. వాస్తవానికి కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి ఏటా జాతర జరుగుతుంది. మూడు నెలల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఇప్పటి వరకు అక్కడికి వెళ్లాలంటే బస్సు రవాణా మాత్రమే ఉండేది. ఇకపై ఈ ప్రాంతానికి రైల్వే రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇకపై కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు రైలు ద్వారా వచ్చే అవకాశం కల్పిస్తోంది రైల్వేశాఖ. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తుల ఇకపై రైలు ద్వారా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ పనులకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.


శరవేగంగా కొమురవెల్లి రైల్వే స్టేషన్

ప్రస్తుతం కొమురవెల్లిలో నిర్మాణంలో ఉన్న రైల్వే స్టేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ స్టేషన్ లో రైళ్లు ఆగుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ కు సంబంధించిన పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఇప్పటికే ప్లాట్‌ ఫారమ్ షెల్టర్, హై లెవల్ ప్లాట్‌ ఫాం పనులు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం స్టేషన్ భవనం ఆర్కిటెక్చరల్ పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఈ రైల్వే హాల్ట్ స్టేషన్ అందుబాటులోకి వస్తే,  హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈజీగా కొమురవెల్లి మల్లన్న చెంతకు చేరుకునే అవకాశం ఉంటుంది.

ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానించేలా..

కొమురవెల్లి రైల్వే స్టేషన్ ద్వారా భక్తులతో పాటు ఆ ప్రాంత ప్రజల రాకపోకలు మరింత సాయపడే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రైల్వే స్టేషన్ రెడీ అవుతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో పాటు భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే అవకాశం ఉందన్నారు.

Read Also: దీపావళి టికెట్లకు ఫుల్ డిమాండ్, బుకింగ్ ఓపెన్ అయిన క్షణాల్లోనే..

Related News

Tatkal Booking: ఈ 5 చిట్కాలు పాటిస్తే.. సెకన్లలో వ్యవధిలో తాత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!

Russia – Ukraine: డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డ రష్యా, ముక్కలు ముక్కలైన ఉక్రెయిన్ ప్యాసింజర్ రైలు!

Free Train Travel: ఇండియాలో స్పెషల్ రైలు, ఇందులో టికెట్ లేకుండా ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు!

Train Journey: 300 మైళ్ల ప్రయాణం.. రూ. 350కే టికెట్.. మయన్మార్ లో ట్రైన్ జర్నీ ఇలా ఉంటుందా?

Sensor Toilet: ఆ రైలులో ‘సెన్సార్’ టాయిలెట్.. మనోళ్లు ఉంచుతారో, ఊడపీకుతారో!

Pregnancy tourism: ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ఎప్పుడైనా విన్నారా! ఆ ప్రాంతం ఎక్కడ ఉందంటే?

IndiGo flights: ఐదేళ్ల తర్వాత చైనాకు ఇండిగో సర్వీసు.. కోల్‌కతా నుంచి మొదలు, టికెట్ల బుకింగ్ ప్రారంభం

Festival Special Trains 2025: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పండుగ రద్దీ వేళ ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలో!

Big Stories

×