India Asia Cup 2025 Squad: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం ఆడే జట్టును తాజాగా ప్రకటించింది. ఇవాళ సెలక్షన్ కమిటీ అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులు… ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే… ముంబైలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కు ఆడే టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ టోర్నమెంట్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అయితే మరో సారి శ్రేయాస్ అయ్యర్ కు నిరాశే ఎదురు అయింది.
ఆసియా కప్ ఆడే టీమిండియా జట్టు ఇదే
అందరూ ఊహించినట్లుగానే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో… ఆసియా కప్ 2025 టోర్నమెంట్ కోసం బరిలోకి దిగనుంది టీమిండియా. అలాగే శుభమణ్ గిల్ కు అందరూ ఊహించినట్లుగానే వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అలాగే సంజూ బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా… ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ ఇద్దరిని కూడా తుది జట్టులోకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకోవడం జరిగింది. గిల్ జట్టులోకి వస్తే తిలక్ వర్మ కు ఛాన్స్ దొరకదని చాలామంది ప్రచారం చేశారు. కానీ అతన్ని మూడవ వికెట్ కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా అలాగే శివమ దూబే, అక్షర్ పటేల్ ఆసియా కప్ కోసం రంగంలోకి దిగబోతున్నారు. వికెట్ కీపర్ లుగా జితేష్ శర్మ అలాగే సంజు బరిలో ఉన్నారు. రింకు సింగ్ తో పాటు… ద బెస్ట్ ఫినిషర్ గా జట్టులోకి జితేష్ శర్మ వచ్చాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లుగా.. బూమ్రా, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్ ఉండనే ఉన్నారు. శివం దూబే అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలర్లుగా పనికి వస్తారు. ఇలా మొత్తం 15 మంది సభ్యులను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది.
ఆసియా కప్ షెడ్యూల్.. పాకిస్తాన్ తో కూడా మ్యాచ్
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. అయితే వచ్చే నెలలో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించింది ఐసిసి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు మొత్తం 19 మ్యాచులు నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 14వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
TeamIndia’s squad for the AsiaCup 2025
Team India: సూర్య కుమార్ యాదవ్ (C), శుభ్‌మన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (WK), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (WK), హర్షిత్ సింగ్ రాణా
Also Read: Watch Video: ఆ గుండె బతకాలి రా.. రనౌట్ కు ఛాన్స్ ఉన్నా కొట్టలేదు… వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే