E-Paper
Advertisement

Nagarjuna: న్యూమరాలజీ పై నమ్మకం లేదు.. ఆ సినిమా వల్ల నమ్మాల్సి వచ్చింది!

Nagarjuna: న్యూమరాలజీ పై నమ్మకం లేదు.. ఆ సినిమా వల్ల నమ్మాల్సి వచ్చింది!
Advertisement

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఈయన పలు సినిమాలలో క్యామియో పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా కుబేర, కూలీ(Coolie) సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఈ రెండు సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ రెండు సినిమాల ప్రమోషన్లలో భాగంగా ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అలాగే జగపతిబాబు (Jagapathi Babu) వ్యాఖ్యాతగా జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి మొదటి అతిథిగా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.

న్యూమరాలజీ పై నమ్మకం లేదు..

Advertisement

ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తన తండ్రి నాగేశ్వరరావు గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు కచ్చితంగా న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు సినిమాలలో సక్సెస్ అందుకోవాలి అంటే న్యూమరాలజీ ప్రకారం చేయాల్సిన పనులను చేస్తూ ఉంటారు కానీ నాగార్జున మాత్రం అలాంటి వాటిని అసలు నమ్మనని తెలిపారు. ఇలాంటి వాటిపై తనకు నమ్మకం లేదని కానీ మనం సినిమా(Manam Movie) తర్వాత నమ్మాల్సి వచ్చింది అంటూ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

మే 22వ తేదీ ఎంతో ప్రత్యేకం…

Advertisement

తన జీవితంలో మే 22వ తేదీకి చాలా ప్రత్యేకత ఉందని వెల్లడించారు. మొదటిసారి నాన్న సినిమా ఆడిషన్ కోసం గుడివాడ నుంచి మద్రాస్ కు మే 22వ తేదీ ట్రైన్ ఎక్కి బయలుదేరారని గుర్తు చేసుకున్నారు. అదే విధంగా నా మొదటి సినిమా షూటింగ్ కూడా మే 22వ తేదీ ప్రారంభమైందని తెలియజేశారు. ఇక మనం సినిమా కూడా మే 22వ తేదీ ప్రీమియర్ పడిందని, ఇక మనం సినిమా తర్వాత తాను న్యూమరాలజిని నమ్ముతున్నాను. నా జీవితంలో మే 22 కు ఎంతో ప్రత్యేకత ఉందని ఈ సందర్భంగా నాగార్జున చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ రోజే 100 వ సినిమా ప్రకటన…

ఇక తన సినీ కెరియర్లో మనం సినిమాకు చాలా ప్రత్యేకత ఉందని నాగార్జున తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాన్నగారికి ఇది ఆఖరి సినిమా అవుతుందని తెలిసిపోతుంది అప్పటికే నాన్న క్యాన్సర్ తో బాధపడుతూ చివరి స్టేజ్ లో ఉన్నారని అర్థమవుతుంది అయితే సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత నాన్న ఈ సినిమా చూశారని సినిమా చూసిన తర్వాతనే మరణించారు అంటూ అప్పటి సంఘటనలను కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ఇక నాగార్జున కెరియర్ విషయానికి వస్తే త్వరలోనే ఈయన వందవ సినిమా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఈనెల 29వ తేదీ నాగార్జున పుట్టినరోజు కావడంతో అదే రోజున తన 100వ సినిమా గురించి అధికారక ప్రకటన రాబోతుందని సమాచారం. ఇలా సినిమాలతో పాటు ఈయన బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా కూడా వ్యవహరిస్తున్నారు.

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×