Manchu Lakshmi:ఈ మధ్యకాలంలో చాలామంది సినిమాల ద్వారా, వ్యాపారాల ద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని కొంతమంది సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి జాబితాలో మంచు వారసురాలు మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఎప్పుడో చేరిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరొకసారి ఇంకో గొప్ప పనికి శ్రీకారం చుట్టి, తన మంచి మనసును చాటుకుంది. మంచు మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. హీరోయిన్ గా సెటిల్ అవుదాం అనుకుంది కానీ కాలం కలిసి రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ అటు విలన్ గా ఆకట్టుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
12 స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు..
ఎక్కువగా వివిధ భాషా చిత్రాలలో నటిస్తున్న ఈమె.. “టీచ్ ఫర్ చేంజ్ ” అనే తన ఎన్జీవో ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని ఏకంగా 12 స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లాలోని కోటమిట్ట కృష్ణ మందిరం వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ కి వెళ్ళిన మంచు లక్ష్మి.. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతి రెడ్డిలతో కలిసి డిజిటల్ క్లాస్ రూమ్లను ప్రారంభించింది. అనంతరం అక్కడి విద్యార్థులతో ముచ్చటించిన ఆమె ఉన్నత విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించింది.
ఆ వ్యత్యాసం తొలగించడమే ప్రధాన లక్ష్యం – మంచు లక్ష్మీ
ప్రైవేట్ పాఠశాలల విద్యకి , ప్రభుత్వ పాఠశాలల విద్యకి ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడమే ప్రధాన లక్ష్యంగా తమ ఎన్జీవో సంస్థ ముందుకు వెళ్తోందని.. అందుకే ఈ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపింది మంచు లక్ష్మి. ఇప్పటికే 12 పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు పూర్తి చేసామని వెల్లడించింది. మొత్తానికైతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం మంచు లక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయానికి పలువురు ప్రశంసలు కురిపిస్తూ.. నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
167 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి..
ఇకపోతే మంచు లక్ష్మి తెలంగాణలోని దాదాపు 167 స్కూళ్లను దత్తత తీసుకుంది. ఆ స్కూల్స్ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు ఆ స్కూల్స్ నిర్వహణ బాధ్యతను నిర్వర్తిస్తూనే.. మరొకవైపు ఇలా నెల్లూరు జిల్లాలో ఏకంగా 12 గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ లు ఏర్పాటు చేయడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.
మంచు లక్ష్మి సినిమాలు..
కెరియర్ విషయానికి వస్తే.. నటిగా సినిమాలు చేసిన ఈమె.. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇలా చాలా భాషల్లోనే నటించింది. చివరిగా 2022లో ‘మాన్ స్టర్’ అనే సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ పలకరించింది. ఇందులో మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా, హనీ రోజ్ (Honey Rose) కీలకపాత్ర పోషించారు. ఇక తర్వాత ‘యక్షిణి’ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు ‘ఆదిపర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
also read:Harihara Veeramallu: బాయ్ కాట్ ట్రెండ్ పై పవన్ రియాక్షన్.. ఎవరూ ఏం పీ*లేరంటూ?