BigTV English

Raviteja : రూటు మార్చిన మాస్ మాహారాజ.. కన్నడ డైరెక్టర్ తో మూవీ..?

Raviteja : రూటు మార్చిన మాస్ మాహారాజ.. కన్నడ డైరెక్టర్ తో మూవీ..?

Raviteja : టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదు. అవేమి పట్టించుకోకుండా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా పూర్తయ్యే లోపు ఇంకో సినిమాకు అన్నీ రెడీ చేసుకుని.. ఇది అవ్వగానే దాని మీదికి వెళ్లిపోతుంటారాయన. సెట్స్ మీద ఒకటి ఉండగానే మరొక సినిమాకు రెడీ అవుతున్నాడు. గత ఏడాది మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. అది డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం తన 75 వ సినిమా మాస్ జాతర షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..


కన్నడ దర్శకుడితో మాసోడి మూవీ.. 

మాస్ జాతర సినిమా త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రవితేజ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది కూడా దాదాపు షూటింగ్పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు రవితేజ చేయబోయే మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి తెలుగు డైరెక్టర్స్ కాదు ఏకంగా కన్నడ డైరెక్టర్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట..ఏపీ అర్జున్. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడైన ధ్రువ్ సర్జాతో ‘మార్టిన్’ సినిమా తీశారు. అది పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మాస్ పేరుతో మరీ క్రింజ్ సీన్లు తీశారంటూ ట్రోలింగ్ కూడా జరిగింది. మాస్ డైరెక్టర్ అయిన అర్జున్ మాసోడితో సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.


Also Read: శ్వేత మీనన్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..?

రవితేజతో అర్జున్ సినిమా ఫిక్స్.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరో అంటే రవితేజనే.. భారీ యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. అర్జున్‌తో తన ఇమేజ్‌ కు సరిపోయే సినిమా చేయడానికి రవితేజ రెడీ అయినట్లున్నాడు. బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే దీన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చెయ్యనున్నారట. ఇకపోతే ‘మాస్ జాతర’ సినిమా ఈ నెల 27నే రిలీజ్ కావాల్సి ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. మాస్ జాతర సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు రవితేజ.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో హిట్ సినిమా పడలేదు. మాస్ జాతర కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బ్యూటిఫుల్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల జోడిగా నటిస్తుంది. ఇది హిట్ అయితేనే రవితేజ ట్రాక్ రికార్డు మళ్లీ మొదలవుతుంది.

Related News

OG Concert: పవన్ కళ్యాణ్ కు ఏది ఊరికే రాదు… మనల్ని ఆపేది ఎవరు..జోష్ నింపిన పవన్!

Pawan Kalyan: సుజీత్ కు పిచ్చి పట్టుకుంది, పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడానికి అదే కారణం

OG concert: ఓజీ రివ్యూ ఇదే..మీసం మెలేసిన తమన్…అంత కాన్ఫిడెంట్ ఏంటీ భయ్యా!

OG Movie : చంపేస్తే చంపేయండి రా… ఇలా మెంటల్ టార్చర్ పెట్టకండి, ఓజి సినిమా చిక్కులు

OG Ticket Price: రూ. కోటి పెట్టి ఓజీ టికెట్స్ కొన్న హైదరాబాద్ అభిమాని.. అది పవన్‌ స్టార్ క్రేజ్‌ అంటే..

Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!

Pawan Kalyan: ఇప్పటి వరకు ఆ రికార్డు లేని ఒకే ఒక్క హీరో పవన్‌.. OGతో సాధ్యమయ్యేనా?

Rajinikanth: రజినీకాంత్ ఆలయంలో నవరాత్రి పూజలు… ఇదేమీ అభిమానం రా సామి!

Big Stories

×