OTT Barbarian Movie : అమెరికన్ హారర్ సినిమాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయంటే… ఊహించని ట్విస్ట్‌లు, సైకలాజికల్ టెన్షన్‌తో వరల్డ్ వైడ్ గా సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఒక డార్క్, అన్‌ప్రెడిక్టబుల్ హారర్ థ్రిల్లర్ ఈరోజు మన మూవీ సజెషన్. గుండెలు గుభేల్మన్పించే ట్విస్ట్‌లు, భయంకరమైన వాతావరణంతో హారర్ మూవీ లవర్స్ కు ఈ మూవీ ఒక థ్రిల్లింగ్ రైడ్ ఫీలింగ్ ఇస్తుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
రెండు ఓటీటీలలో… కానీ చిన్న ట్విస్ట్
ఈ హర్రర్ మూవీ పేరు ‘Barbarian’. జాక్ కోగన్ దర్శకత్వంలో, 20th సెంచరీ స్టూడియోస్ నిర్మాణంలో 2022లో రిలీజైంది. ఇది హులు, డిస్నీ+ (కొన్ని రీజియన్స్‌లో), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ట్విస్ట్ ఏంటంటే ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. 4 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 45 మిలియన్ల కలెక్షన్‌తో 2022లో ఒక సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది. అయితే ఇందులో వయోలెన్స్, కొన్ని ఫ్యామిలీతో చూడకూడని సీన్స్ ఉన్నాయి. కాబట్టి సెన్సిటివ్ వీక్షకులు జాగ్రత్తగా చూడాలి.
కథలోకి వెళ్తే…
ఈ మూవీ స్టోరీ టెస్ (జార్జినా క్యాంప్‌బెల్) అనే యువతి కథతో మొదలవుతుంది. టెస్ డెట్రాయిట్‌లో ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం వస్తుంది స్టే చేయడానికి రెంటల్ హౌస్‌ను బుక్ చేస్తుంది. ఆమె రాత్రి ఆ రెంటల్ హౌస్ కు చేరుకునే సరికి… అప్పటికే కీత్ (బిల్ స్కార్స్‌గార్డ్) అనే వ్యక్తి ఉంటాడు. అనుకోకుండా ఇద్దరికీ ఒకే రూమ్ బుక్ అవుతుంది. డెట్రాయిట్‌లోని డేంజరస్ నైబర్‌హుడ్, వర్షం కారణంగా టెస్ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. అయినప్పటికీ కీత్ గురించి ఆమెకు అనుమానం ఉంటుంది.
రాత్రి వింత శబ్దాలు, తలుపులు తెరుచుకోవడం వంటి సంఘటనలు జరుగుతాయి. దీంతో టెన్షన్ మొదలవుతుంది. తర్వాత టెస్ హౌస్ బేస్‌మెంట్‌లో ఒక సీక్రెట్ టన్నెల్‌ను కనుగొంటుంది. ఇందులో ఒక రహస్య గది, మ్యాట్రెస్, ఒక కెమెరా ఉంటాయి. కీత్‌తో కలిసి టన్నెల్‌లోకి వెళ్లినప్పుడు, ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఒక భయంకరమైన, అమానుషమైన జీవి కీత్‌ను చంపేస్తుంది. టెస్ బాగా గాయపడుతుంది.
సినిమా ఒక ఫ్లాష్‌బ్యాక్‌కు షిఫ్ట్ అవుతుంది. ఇది 1980లలో హౌస్ మాజీ ఓనర్ ఫ్రాంక్ (రిచర్డ్ బ్రేక్) ఒక సీరియల్ కిల్లర్, రేపి*స్ట్. ఫ్రాంక్ మహిళలను కిడ్నాప్ చేసి, బేస్‌మెంట్ టన్నెల్స్‌లో బంధిస్తాడు. అక్కడ అతని బాధితులు ఒక వికృతమైన జీవికి జన్మనిస్తారు. ఇది “ది మదర్”గా పిలువబడుతుంది. ఈ జీవి హౌస్‌లో దాక్కుని ఉంటుంది.
కథ ప్రెజెంట్‌కు తిరిగి వస్తుంది. ఇక్కడ AJ (జస్టిన్ లాంగ్) అనే హాలీవుడ్ నటుడు హౌస్ ప్రస్తుత ఓనర్. అతనిపై అఘాయిత్యం ఆరోపణలు ఉండడంతో, ఆస్తిని అమ్మడానికి డెట్రాయిట్‌కు వస్తాడు. ఓనర్ని కూడా టన్నెల్స్ లో బంధిస్తుంది ది మదర్. అది టెస్, ఇప్పటి ఓనర్ ని తన పిల్లలుగా చూస్తుంది. వారిని బలవంతంగా ఫీడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓ మైండ్ బెండింగ్ ట్విస్ట్ తో క్లైమాక్స్ ఎండ్ అవుతుంది.