E-Paper
Advertisement

Rekha Nirosha : ఆ క్యారక్టర్ కు తెలుగు హీరోయిన్లను తీసుకోరా..? రేఖా ఏం చెప్తున్నారంటే..?

Rekha Nirosha : ఆ క్యారక్టర్ కు తెలుగు హీరోయిన్లను తీసుకోరా..? రేఖా ఏం చెప్తున్నారంటే..?
Advertisement

Rekha Nirosha : టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రేఖా నిరోషా.. తెలుగు అమ్మాయి అయినా ఈ ముద్దుగుమ్మ వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు మనసుల్లో నటిగా ముద్ర వేసుకుంది. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా నటనకు ప్రశంసలు దక్కేలా చేశాయి.. ‘ఏకాంతవేళ’ అనే మూవీ తో హీరోయిన్గా పరిచయమైంది. అది పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత స్టార్ హీరోలు సినిమాలలో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో భాగంగా ఎన్నో విషయాలను పంచుకుంది.. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అనే అంశంపై ఆమె కొన్ని ఆసక్తికర నిజాలను పంచుకుంది.. అసలు ఆమె తెలుగు సినిమాలు, హీరోయిన్ల గురించి ఏం చెప్పిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

అలాంటివి తెలుగు హీరోయిన్లు చెయ్యరా..?

టాలీవుడ్ హీరోయిన్ రేఖా నిరోషా స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈమె ఇటీవల పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలుగు హీరోయిన్లకు ఎందుకు డిమాండ్ లేదు..? వాళ్లను స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లుగా సెలెక్ట్ చెయ్యరు అని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆమె మాట్లాడుతూ.. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ తెరకేక్కిస్తున్న సినిమాల్లో వేరే ఇండస్ట్రీ నుంచి హీరోయిన్లను తీసుకొని వస్తున్నారు. అందుకు కారణం పాన్ ఇండియా సినిమాలు కావడమే అని ఆమె అన్నారు. వేరే ఇండస్ట్రీ హీరోయిన్ తీసుకొని వస్తే అక్కడ ఈ సినిమాకు మంచి టాక్ వస్తుందని ఇలా చేస్తున్నారు.. అది తప్ప తెలుగు హీరోయిన్లకు ఛాన్సులు రాలేదు అని చెప్పడం లేదు అని రేఖా క్లారిటీ ఇచ్చారు. ఏ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ తీసుకొస్తే, ఆ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ వల్ల సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని డైరెక్టర్లు కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారని రేఖ అంటున్నారు.. తెలుగు హీరోయిన్ల అవకాశాల గురించి ఆమె వివరంగా అన్ని విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

నిర్మలమ్మ లాగ ఉండాలని కోరిక..

Advertisement

అదేవిధంగా మీ ఫేవరెట్ హీరో హీరోయిన్లు ఎవరు అని యాంకర్ అడుగుతారు.. దానికి రేఖ ఒకప్పుడు సౌందర్య గారు వెంకటేష్ గారు నా ఫేవరెట్ హీరో హీరోయిన్లు. ఇప్పుడు అంటే నాకు అంతగా ఎవరు అనిపించలేదు అని ఆమె అన్నారు. అసలు మీ కోరిక ఏంటి అని అడుగుతారు. వెంటనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాలి అని కాకుండా నిర్మలమ్మ గారి లాగా చాలా సాఫ్ట్ గా, నా పనేదో నేను చేసుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని ఆమె కోరికలు బయట పెట్టింది.

Also Read : చిరంజీవిని కలిసిన కష్టాలు తీరలేదా బాబాయ్.. కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు..

రేఖా నిరోషా నటించిన సినిమాలు.. 

Advertisement

‘ఏకాంతవేళ’ చిత్రంతో అరంగేట్రం చేసింది.. ఆ సినిమా ఆమెకు భారీ విజయనయితే అందించలేదు కానీ నటనకు మంచి మార్కులు పడేలా చేసింది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించింది. ‘అడవి దొంగ’ (2023), ‘చీటర్’ (2023), ‘మా నాన్న నక్సలైట్’ (2022) వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది..అలాగే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రంలో కూడా ఒక పాత్రలో నటించింది. ప్రస్తుతం సినిమాలలో లైనప్ లో పెట్టుకుంటూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలను పంచుకుంటుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి.

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×