E-Paper
Advertisement

Kodi Ramakrishna Birth Anniversary: శతాధిక డైరెక్టర్ కోడి రామకృష్ణ జయంతి.. ఆ ఘనత సాధించిన ఏకైక డైరెక్టర్!

Kodi Ramakrishna Birth Anniversary: శతాధిక డైరెక్టర్ కోడి రామకృష్ణ జయంతి.. ఆ ఘనత సాధించిన ఏకైక డైరెక్టర్!
Advertisement

Kodi Ramakrishna Birth Anniversary:ప్రముఖ దిగ్గజ దర్శకులు కోడి రామకృష్ణ(Kodi Ramakrishna) 1949 జూలై 23న పాలకొల్లులో జన్మించారు. ఇండస్ట్రీలోకి రాకముందు పాలకొల్లు లోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసిన ఈయన.. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా మారారు. టాలీవుడ్ లో అగ్ర హీరోలు అందరితో సినిమాలు చేసిన ఈయన.. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ,మలయాళం చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా రచయితగా, నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఎంతో గొప్ప వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. 2019 ఫిబ్రవరి 22న హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. ఇకపోతే ఈరోజు ఆయన జయంతి (76) కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

జోనర్ ఏదైనా బ్లాక్ బస్టర్ గ్యారంటీ..

Advertisement

తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత కే. రాఘవ నిర్మాతగా రూపొందించిన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ సినిమాతోనే కోడి రామకృష్ణ దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టగా.. చిరంజీవి తొలి రోజులలో హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం అందుకుంది. ఇక తర్వాత ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ చిత్రాలు, ఫిక్షన్ ఫాంటసీ, థ్రిల్లర్, పొలిటికల్ సెటైర్స్ ఇలా జోనర్ ఏదైనా సరే బ్లాక్ బాస్టర్ హిట్ సాధించి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఆ ఘనత ఒక్క కోడి రామకృష్ణకే సాధ్యం..

Advertisement

ఇకపోతే టాలీవుడ్ లో మరే దర్శకుడికి లేనన్ని సిల్వర్, గోల్డెన్ జూబ్లీ సినిమాలు చేసిన ఘనత ఈయనకే సొంతం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈయన సృష్టించిన ఈ రికార్డుని మరే డైరెక్టర్ సృష్టించలేదు అనడంలో సందేహం లేదు. కృష్ణ, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, బాలకృష్ణ, చిరంజీవి, రాజశేఖర్, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించడమే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో వీఎఫ్ ఎక్స్ సినిమాలు చేయడం చాలా సాధారణం.. కానీ అప్పట్లో అవేవీ తెలియదు. అలాంటి సమయంలో కూడా అమ్మోరు, అరుంధతి, దేవీ, దేవీపుత్రుడు, అంజి వంటి సినిమాలలో అబ్బురపరిచేలా గ్రాఫిక్స్ ని క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు గ్రాఫిక్స్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఈయనకే సాధ్యం. ఇక 120 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శతాధిక దర్శకుడిగా కూడా బిరుదు పొందారు.

ALSO READ:Balakrishna Akhanda2: అఖండ2 షూటింగ్ లోకేషన్ వీడియో… నదిలో బాలయ్య యాక్షన్!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×