E-Paper

కలియుగంలో ఉన్నాం.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. జాగ్రత్త.. హెచ్చరించిన రేణు దేశాయ్!

కలియుగంలో ఉన్నాం.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. జాగ్రత్త.. హెచ్చరించిన రేణు దేశాయ్!
Advertisement

Renudesai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమె కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన ఈమె సినిమాలకు కూడా దూరం అవుతూ తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇటీవల ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్న రేణు దేశాయ్ మరో వైపు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

వీధి కుక్కల రక్తంతో వ్యాపారం..

మూగజీవాల సంరక్షణ కోసం ఈమె పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడమే కాకుండా, మూగ జంతువుల కోసం భారీ స్థాయిలో ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తూ వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. జంతువులను ఎవరైనా హింసిస్తే తప్పనిసరిగా రేణు దేశాయ్ రియాక్ట్ అవుతూ వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇటీవల హైదరాబాద్ లోని షేక్ పేట ప్రాంతంలో వీధి కుక్కల నుంచి రక్తాన్ని సేకరిస్తూ కేవలం 350 ml రక్తాన్ని సుమారు 18 నుంచి 20వేల రూపాయలకు అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ వెటర్నరీ ఆసుపత్రి సిబ్బంది, వీధి కుక్కల సంరక్షణ పేరుతో వాటిని బంధించి, ఈ దారుణానికి పాల్పడటంతో ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సంరక్షణ పేరుతో అక్రమాలు..

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా రేణు దేశాయ్ సైతం ఈ ఘటనపై స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె మాట్లాడుతూ చాలామంది సంరక్షణ పేరుతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అయితే మనం కూడా మన జంతువులను హాస్పిటల్ కి తీసుకెళ్లి రక్తం ఎక్కించేటప్పుడు ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగాల్సిన బాధ్యత ఉందని ఈమె తెలిపారు.

?igsh=ZzNkNWtkeWc0MHAw

Advertisement

ఇలా వీధి కుక్కల నుంచి రక్తం సేకరించి వాటిని అమ్ముతూ డబ్బు సంపాదించడం చాలా పెద్ద తప్పు. మనం కలియుగంలో ఉన్నాము. ఇప్పుడు అక్రమంగా డబ్బు సంపాదిస్తే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదని మన పట్ల మాత్రమే కాకుండా మన ఏడు తరాల పిల్లల వరకు ఆ కర్మ వెంటాడుతూనే ఉంటుందని రేణు దేశాయ్ తెలిపారు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు మాత్రమే మన దగ్గర ఉంటుందని, ఇలా తప్పు మార్గంలో డబ్బు సంపాదించడం కోసం ఇలాంటి దారుణాలకు పాల్పడొద్దు అంటూ రేణు దేశాయ్ హెచ్చరించారు. ఇలా కుక్కల నుంచి రక్తం అమ్మి డబ్బు సంపాదించడం చాలా దారుణమని తెలిపారు. దయచేసి ఇలాంటి తప్పుడు పనులు ఎవరూ చేయొద్దు, ఎవరు చూడకపోయినా కర్మ మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదని ఈమె హెచ్చరించారు అదేవిధంగా ఎండాకాలం కావడంతో పక్షులకు జంతువులకు నీటిని అందుబాటులో పెట్టాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు.

Also Read: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మల్లారెడ్డి.. బయోపిక్ సినిమాకి శ్రీకారం!

Related News

సంచిత ఉగాలే చివరి రీల్ వైరల్.. నమ్మలేకపోతున్న అభిమానులు!

తండ్రీకొడుకుల డబుల్ ధమాకా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!

ప్రస్తుత పరిస్థితులే నన్ను రాజకీయాల వైపు నడిపించాయి: రాఘవ లారెన్స్

పెళ్లి రోజున కవల పిల్లల మొదటి ఫోటో షేర్ చేసి ఉపాసన ఎమోషనల్..

‘విశ్వంభర’ సమ్మర్ మిస్.. దసరా రేసులోకి మెగాస్టార్? సస్పెన్స్‌లో ఫ్యాన్స్!

‘లగాన్’ 25 ఏళ్ల వేడుక.. సరికొత్త లుక్‌లో సల్మాన్ ఖాన్.. కరీనా, జూహీ చావ్లా సందడి!

ఆ బుల్లితెర నటికి ఆడపిల్ల.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు!

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు.. ‘దంగల్’ కంటే రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకే ఎక్కువ ఆదరణ!

×