E-Paper
Advertisement

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో
Advertisement

Pinkie Roshan: బాలీవుడ్‌లో ఫిట్‌నెస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే హీరోల్లో హృతిక్ రోషన్ ఒకరు. కఠినమైన వర్కౌట్స్, క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ తో సాలిడ్  ఫిజిక్‌తో ఆయన ఎన్నో ఏళ్లుగా అభిమానులకు ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు.అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్ ఈ గ్రీక్ గాడ్ గురించి కాదు ..వాళ్ళ మదర్  పింకీ రోషన్ గురించి. ఎందుకంటారా …71 ఏళ్ల వయసులో జిమ్ లో  చెమటలు చిందిస్తుంది మరి.ఇక ఇది చూసిన నెటిజన్లు మీ వయసులో ఆస్పత్రిలకి చక్కర్లు కొడుతుంటే మీరు మాత్రం ఎంచక్కా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారా అంటూ నోరెళ్ళ బెట్టేస్తున్నారు.

వైరల్ అవుతున్న వర్కౌట్ వీడియో

Advertisement

తాజాగా పింకీ రోషన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో  షేర్ చేసిన వీడియోలో ఎన్నో రకాల ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తూ కనిపించారు. వెయిట్ ట్రైనింగ్, బ్యాలెన్స్ ఎక్సర్‌సైజులు, స్ట్రెచింగ్, కోర్ స్ట్రెంగ్త్ పెంచే మూవ్‌మెంట్స్‌ను ఎంతో ఈజీగా చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో వేలాది మంది నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఈ వయసులో ఇంత ఎనర్జీ ఎలా సాధ్యం?”,”మాకు కూడా ఇలాంటి ఇన్‌స్పిరేషన్ కావాలి”, “రియల్ సూపర్ ఉమెన్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

58 ఏళ్ల తర్వాత మొదలైన ఫిట్‌నెస్ జర్నీ

Advertisement

పింకీ రోషన్ ఫిట్‌నెస్ ప్రయాణం కూడా చాలా మందికి తెలియని విషయమే. ఆమె 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతే రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లడం ప్రారంభించారు. అప్పటి వరకు సాధారణ జీవితం గడిపిన ఆమె, ఆరోగ్యం కోసం వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకున్నారు. మొదట్లో చిన్న చిన్న ఎక్సర్‌సైజులతో మొదలైన ఈ ప్రయాణం.. ఇప్పుడు కఠినమైన వర్కౌట్స్ చేసే స్థాయికి చేరుకుంది. గత 13 ఏళ్లుగా ఆమె ఎలాంటి విరామం లేకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం విశేషం.

‘HHH’ రూల్‌తో హెల్తీ లైఫ్

పింకీ రోషన్ ఎప్పుడూ “HHH” అనే సూత్రాన్ని ఫాలో అవుతుంటారు. ఇందులో Head, Heart, Hand అనే మూడు అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలి, శరీరం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలన్నదే ఆమె నమ్మకం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకోవాలని ఆమె తరచూ చెబుతుంటారు. అందుకే వ్యాయామంతో పాటు సరైన ఆహారం, పాజిటివ్ థింకింగ్, క్రమబద్ధమైన జీవనశైలిని కూడా పాటిస్తుంటారు.

ఇది పింకీ రోషన్ షేర్ చేసిన తొలి వర్కౌట్ వీడియో కాదు. ఈ ఏడాది జూన్‌లో కూడా ఆమె పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. అప్పుడే చాలామంది ఆమె ఫిట్‌నెస్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరోసారి కొత్త వీడియోతో ఆమె వార్తల్లో నిలిచారు. ప్రతి వీడియోలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

హృతిక్‌కు స్ఫూర్తిగా నిలిచిన తల్లి

హృతిక్ రోషన్ కూడా తన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో గర్వంగా మాట్లాడారు. తన ఫిట్‌నెస్‌కు ప్రధాన ప్రేరణల్లో ఒకరు తన తల్లేనని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబంలో ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని బీ టౌన్ లో అంతా అంటుంటారు.ప్రస్తుతం హృతిక్ రోషన్  భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటే  మరోవైపు ఆయన తల్లి పింకీ రోషన్ మాత్రం సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారిపోయారన్న మాట.

Tags

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×