E-Paper
Advertisement

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!
Advertisement

AI Deepfak: ఒకప్పుడు ఫోటో షాప్ నేర్చుకోవాలంటే అదో తతంగం.మినిమం ఐదారు నెలల కోర్స్ చేయాల్సి వచ్చేది.కానీ ఇపుడు ట్రెండ్ మారింది. AI మన జీవితాల్లోకి దూసుకువచ్చింది,కాదు కాదు పాతుకు పోయింది. అది ఎంతలా అంటే ఒక స్మార్ట్ ఫోన్ ,ఓ రెండు యాప్ లు ఉంటె చాలు ఎవరినైనా సరే సరికొత్త అవతారంలో దించేస్తున్నారు.అంతవరకు బాగానే ఉంది కాని,అదే యాప్ ని విచ్చలవిడిగా వాడి డీప్ మార్ఫింగ్ పేరు తో హీరోయిన్ల ఫోటోలని బూతు చిత్రాలుగా మార్చడంతోనే అసలు సమస్య.

ఫైర్ అయిన మృణాల్ 

Advertisement

తాజాగా ఈ AIతోనే ఇబ్బందుల్లో పడింది మృణాల్ ఠాకూర్. ఎవరో  ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో ఈమె ఫోటోలను AIతో మార్ఫింగ్ చేసి వదిలారు. అంతే, క్షణాల్లో నెట్‌లో ఆ ఫోటోలు  వైరల్ అయిపోయాయి. విషయం తెలుసుకున్న మృణాల్ ఒక్కసారిగా మండిపడ్డారు. “నా పేరుతో ఇలాంటి నకిలీ ఫోటోలు తయారు చేయడం చట్టవిరుద్ధం. వెంటనే వాటిని తొలగించండి. లేకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు” అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు… ఇకపై ఆ ఫోటోలను ఎవరైనా షేర్ చేసినా వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కుండబద్దలు కొట్టేసింది.

నిజానికి ఇది మృణాల్ ఒక్కరికే జరిగిన విషయం కాదు. గతంలో రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ గుర్తుంది. ఆ తర్వాత కాజోల్, ఆలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా… ఇలా చాలామంది సెలబ్రిటీలు AI మార్ఫింగ్‌కు బలయ్యారు. ఇప్పుడు చూస్తుంటే స్టార్ అయ్యే ముందు సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ… స్టార్ అయిన తర్వాత డీప్‌ఫేక్ మాత్రం గ్యారెంటీ అన్నట్టుగా తయారైంది పరిస్థితి

Advertisement

ట్రాక్ తప్పిన AI 

AI అసలు ఉద్దేశం మనుషుల పనిని సులభం చేయడం. డాక్టర్లకు సహాయం చేయాలి, విద్యార్థులకు ఉపయోగపడాలి, పరిశోధనలను వేగవంతం చేయాలి. కానీ కొందరి చేతుల్లో పడిన తర్వాత అదే టెక్నాలజీ వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఫాలోవర్ల కోసం వాడే బొమ్మగా మారిపోయింది. ఒకప్పుడు “ఫేక్ న్యూస్” భయపెట్టేది. ఇప్పుడు “ఫేక్ వీడియో” ఇంకా “ఫేక్ ఫోటో” అసలైన టెన్షన్‌గా మారిపోయాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో పరిస్థితి ఎలా ఉందంటే… ఏదైనా వీడియో కనిపిస్తే ముందు “ఇది నిజమేనా… లేక AIనా?” అని అనుమానం రావడం కామన్ అయిపోయింది. రేపు మన కళ్లతో చూసిన వీడియోను కూడా నమ్మలేని రోజులు వస్తాయేమో అనిపిస్తోంది. టెక్నాలజీ ఇంత వేగంగా పరుగులు తీస్తుంటే… దాన్ని కంట్రోల్ చేసే చట్టాలు ఆ వేగాన్ని అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

డీప్‌ఫేక్ టార్గెట్ అనే కొత్త ట్యాగ్

ఒకప్పుడు హీరోయిన్లకు పాపులారిటీ అంటే ఫ్యాన్స్, హిట్స్, అవార్డులు. ఇప్పుడు వాటితో పాటు “డీప్‌ఫేక్ టార్గెట్” అనే కొత్త ట్యాగ్ కూడా వచ్చేసింది. ఇక ముందు సినిమా ప్రమోషన్ కంటే ముందు “ఈ వీడియో నిజమా… AI క్రియేషన్‌నా?” అని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అని సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.

also read :ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

ఏఈ ఏమైనా ఈరోజు సెలబ్రిటీలు బలైతే… రేపు సాధారణ ప్రజలు కూడా ఈ AI ఉచ్చులోపడే ప్రమాదం ఉంది. ఎవరి ఫోటోనైనా తీసుకుని నకిలీ వీడియోలు తయారు చేయడం, పరువు తీసేలా సోషల్ మీడియాలో వైరల్ చేయడం కొన్ని నిమిషాల పని అయిపోయింది. అందుకే AI టెక్నాలజీ ఎంత గొప్పదైనా… దాన్ని ఉపయోగించే మనిషి ఆలోచనే దాని మంచిని, చెడుని నిర్ణయిస్తుంది.

Tags

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×