E-Paper
Advertisement

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!
Advertisement

Allu Arjun: పుష్ప సిరీస్ ఏ ముహుర్తాన రిలీజ్ అయిందో కాని అల్లు అర్జున్ క్రేజ్ ఆకాశానికి తాకేసింది.ఇక ఆ క్రేజ్ ని ఇపుడు మరోసారి  వైజాగ్‌లో చూడొచ్చని సోషల్ మీడియాలో తెగ వార్తలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.కారణం.. ఆగస్టు 9న విశాఖపట్నంలో ప్రారంభం కానున్న AAA మల్టీప్లెక్స్. ఈ మల్టీప్లెక్స్‌ను స్వయంగా అల్లు అర్జున్ ప్రారంభించనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌తో పాటు అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా.. ఈ వార్త మాత్రం నెట్టింట్లో  వైరల్ అవుతోంది.

అల్లు అర్జున్ స్వయంగా వచ్చి

Advertisement

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే వేలాది మంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా అనుమతులు లభిస్తే అల్లు అర్జున్ స్వయంగా వచ్చి రిబ్బన్ కట్ చేసి AAA మల్టీప్లెక్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉత్తరాంధ్రలోనే అత్యంత ఆధునిక థియేటర్

Advertisement

విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ AAA మల్టీప్లెక్స్ అత్యాధునిక సౌకర్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్ధమైంది. మొత్తం ఎనిమిది ప్రీమియం స్క్రీన్లతో పాటు లేటెస్ట్ లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, లగ్జరీ రిక్లైనర్ సీట్లు, విశాలమైన ఫుడ్ కోర్ట్, ప్రీమియం లాంజ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉండనున్నట్లు సమాచారం. సినిమా చూసే అనుభవాన్ని మరో లెవల్‌కు తీసుకెళ్లే విధంగా ఈ మల్టీప్లెక్స్‌ను డిజైన్ చేశారని తెలుస్తోంది. అందుకే ఇది ఉత్తరాంధ్రలోనే అత్యంత ఆధునిక థియేటర్లలో ఒకటిగా నిలవబోతోందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

అల్లు అర్జున్‌కు సినిమాలే కాదు.. వ్యాపార రంగంలోనూ మంచి అవగాహన ఉందనే విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో AAA సినిమాస్‌తో థియేటర్ బిజినెస్‌లో అడుగుపెట్టాడు బన్నీ.ఇప్పుడు అదే బ్రాండ్‌ను విశాఖపట్నానికి తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 9 కోసం వెయిటింగ్

ఇక బన్నీ వైజాగ్‌కు వస్తున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. “ఆగస్టు 9 కోసం వెయిటింగ్”, “వైజాగ్‌లో బన్నీ సందడి ఖాయం”, “పుష్ప రాజ్ వస్తున్నాడు” అంటూ ఇప్పటికే ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. బన్నీని ఒక్కసారి దగ్గరగా చూడాలని వేలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఆయన వచ్చేది కన్ఫర్మ్ అయితే  భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మొత్తానికి వైజాగ్‌లో AAA మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం ఇప్పుడు సినిమా అభిమానుల్లోనే కాదు,అటు బిజినెస్ సర్కిల్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది.చూడాలి దీనిపై త్వరలో  ఏమైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వదులుతారో !

Tags

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×