E-Paper
Advertisement

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
Advertisement

NTR Injury: KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  డ్రాగన్ సినిమాని చేస్తున్నాడు తారక్.ఇక సినిమా జోరుగా షూటింగ్ నడుస్తుండగా గత కొన్ని రోజుల కింద తారక్ భుజానికి తీవ్రంగా గాయమైన సంగతి తెల్సిందే.అయితే ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న తారక్ మరో రెండు వారాల పాటు షూటింగ్ కి దూరంగా ఉండనున్నాడని సమాచారం .

నిజానికి డ్రాగన్ సినిమాపై దేశవ్యాప్తంగా ఎన్ని అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు.సరిగ్గా ఈ సమయంలోనే  తారక్ కి గాయం కావడం వల్ల  షూటింగ్ ఇక  ఆగిపోతుందేమో అని అనుకున్నారంతా.కానీ మూవీ టీమ్ మాత్రం ఎక్కడా డిలే చేయకుండా షూటింగ్ ని పరుగులు పెట్టిస్తుందని తెలుస్తుంది. హీరో అవసరం లేని సీన్స్ ,ఇతర నటీనటులపై ఉండే కీలక ఎపిసోడ్లు, యాక్షన్ లేని సీక్వెన్స్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడట నీల్.

Advertisement

నీల్ మామ ప్లాన్ మాములుగా లేదుగా 

ప్రశాంత్ నీల్ పని చేసే విధానం గురించి తెలిసిన వాళ్లకు ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. ముందుగానే షూటింగ్ ప్లానింగ్ సిద్ధం చేసుకుని, పరిస్థితులకు తగ్గట్టు షెడ్యూల్ మార్చుకోవడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. అందుకే ఎన్టీఆర్ విశ్రాంతిలో ఉన్నా సినిమా పనులు ఎక్కడా ఆగిపోకుండా చూసుకుంటున్నారని చెబుతున్నారు. తారక్ తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టే సమయానికి ఆయనపై షూట్ చేయాల్సిన సీన్స్ ని, అలాగే మేజర్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసేలా ప్లాన్ సిద్దం చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

‘డ్రాగన్’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే.ప్రశాంత్ నీల్ స్టైల్ యాక్షన్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి మరో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ఇవ్వబోతున్నాయనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాతలు కూడా ఏ మాత్రం తొందర పడకుండా  హీరో ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది.అవసరమైతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసినా సరే కాని క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడబోరని ఇన్ సైడ్ వినిపిస్తున్న టాక్.

నీ ఆరోగ్యం ముఖ్యం అంటున్న ఫ్యాన్స్ 

ఇక గాయం గురించి తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. “త్వరగా కోలుకోవాలి అన్నా”, “నీ ఆరోగ్యం ముఖ్యం”, “షూటింగ్ కంటే ముందు పూర్తిగా రికవరీ అవ్వాలి” అంటూ వేల సంఖ్యలో పోస్టులు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా తారక్ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్న వారే.

ఇక ఈ మధ్య టాలీవుడ్ లో వరుస గాయాల సంఘటనలు పెరుగుతుండటం కూడా చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణకు కూడా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయం అయింది. హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఓ సినిమా చిత్రీకరణలో గాయపడిన విషయం తెలిసిందే. అలాగే రామ్ చరణ్ కూడాతాజాగా చేతికి సర్జరీ చేయించుకున్నవాడే.దీంతో ఇలా  వరుసగా స్టార్ హీరోలు, హీరోయిన్లు గాయాలని  ఎదుర్కొంటుండటంతో షూటింగ్ సెట్లలో భద్రతా చర్యలపై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది.

మరో రెండు వారాల్లో ‘డ్రాగన్’ సెట్స్‌లోకి 

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వేగంగా కోలుకుంటున్నారని సమాచారం. మరో రెండు వారాల్లో పూర్తిగా ఫిట్‌గా మారి మళ్లీ ‘డ్రాగన్’ సెట్స్‌లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకుని మళ్లీ అదే ఎనర్జీతో కెమెరా ముందు కనిపించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×