Renu Desai: నటిగా, మోడల్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రేణూ దేశాయ్ (Renu Desai).అలాంటి ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా తనలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్యగానే తనను గుర్తిస్తున్నారు అంటూ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తాను.. తన భర్త నుండి దూరమై 14 ఏళ్లవుతున్నా.. ఇంకా వనవాసం అయిపోలేదు అంటూ చేసిన ఎమోషనల్ కామెంట్లు అందరినీ కదిలించాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం మరొకవైపు వరుస సినిమా షూటింగ్ లతో బిజీ అయిపోయారు రేణూ దేశాయ్.
అందులో భాగంగానే ధనుష్, శ్రీ లీల కాంబినేషన్ లో.. సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓం సినిమాలో ఈమె కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నవంబర్ 17న చాలా ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రేణూ దేశాయ్ తన లుక్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎల్లో అండ్ మస్టర్డ్ గ్రీన్ కాంబినేషన్లో చీర ధరించి, తన సింపుల్ లుక్ తో అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. ముఖ్యంగా సాంప్రదాయంగా కనిపిస్తూనే.. క్లాసీ లుక్ లో ఆకట్టుకోవడంతో అభిమానులు సైతం రేణూ దేశాయ్ అందానికి ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా ఈ లుక్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆమె హెయిర్ స్టైల్ గురించి ఆమె ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగిందట . ఇంత అందంగా నీ హెయిర్ ను ఎవరు స్టైల్ చేశారని.. అయితే తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా రేణూ దేశాయ్ ఒక వీడియోని రిలీజ్ చేస్తూ.. తన హెయిర్ స్టైలిస్ట్ ని పరిచయం చేసింది. ఇక ఆ వీడియో చూసిన అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.
also read: అన్నపూర్ణ స్టూడియోలో ‘ది ఏజ్ ఆఫ్ భారత్’ గేమ్ చిత్రీకరణ.. పూర్తి వివరాలు ఇవే!
రేణూ దేశాయ్ విడుదల చేసిన వీడియో విషయానికి వస్తే.. ఈరోజు మీ అందరికీ నా స్పెషల్ హెయిర్ స్టైలిస్ట్, ఎక్స్పెన్సివ్ హెయిర్ స్టైలిస్ట్ ని పరిచయం చేయబోతున్నాను. హెయిర్ స్టైలిస్ట్ కి మేకప్ కి క్రెడిట్ ఎందుకు ఇవ్వలేదని నా స్నేహితులు అడుగుతున్నారు. ఇదిగో చూడండి ఈమె నా హెయిర్ స్టైలిస్ట్ అంటూ తన కూతురు ఆ తన హెయిర్ ను స్టైల్ చేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆధ్యా తన తల్లి హెయిర్ ను స్టైల్ చేస్తూ కనిపించింది. నేను ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలి అంటే ఈమె నన్ను రెడీ చేస్తుంది. అంటూ తెలిపింది రేణూ దేశాయ్. మొత్తానికైతే తన హెయిర్ స్టైలిస్ట్ తో తన కూతురు ఆద్య అని తెలిసి అభిమానులు ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. మీ క్యూట్ హెయిర్ స్టైలిస్ట్ మరింత క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
?utm_source=ig_web_copy_link&lqvp=NTc4MTIwNjQ2YQ==