Sandeep Reddy Vanga:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy vanga) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. యానిమల్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి స్పిరిట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు చిన్న చిత్రాలకు తన వంతు ప్రమోషన్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ‘మోసపోయాం జానకి’ అనే టైటిల్ తో కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.
ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేయడంతో దీనిపై అందరిలో క్యూరియాసిటీ పెరిగిందని చెప్పాలి. మరి ఏంటి ఈ సినిమా? అసలు దీని కథ ఏంటి ? ఎవరు నటిస్తున్నారు? దర్శకుడు ఎవరు? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మోసపోయాం జానకి అనే సినిమా విషయానికి వస్తే.. సాయి సోహన్, విస్మయ శ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న నూతన చిత్రానికి ‘మోసపోయాం జానకి’ అనే ఆసక్తికర టైటిల్ ను సందీప్ రెడ్డి వంగ అధికారికంగా ప్రకటించారు. నిసా ఎంటర్టైన్మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మధుసూదన్ రెడ్డి గోపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిఫరెంట్ కామెడీ , క్రైమ్ ఎంటర్టైనర్ గా రాబోతోంది. టైటిల్ పోస్టర్లో ముగ్గురు యువకులు డబ్బు సంచులతో అంబాసిడర్ కారువైపు పరిగెడుతున్నట్లు చూపించారు. అంతేకాకుండా ప్రభుత్వం రద్దు చేసిన పాత కరెన్సీ నోట్లు ఆ సంచల నుండి కింద పడడం పోస్టర్లో కనిపిస్తోంది.
also read:పెళ్లి పీటలెక్కబోతున్న గుప్పెడంత మనసు సీరియల్ సాక్షి.. పోస్ట్ వైరల్!
ఈ పోస్టర్ చూస్తుంటే డబ్బు చుట్టూ జరిగే మోసాలు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్ కామెడీ అంశాలను మేళవించి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త తరహా కామెడీ మూవీ అన్నట్టుగా దర్శకుడు తెలిపారు. వచ్చే యేడాది ఈ చిత్రాన్ని గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నరేంద్ర రవి , విష్ణు ఓయ్, హరితేజ, అజయ్, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, మాణిక్ రెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిన్న సినిమాకి టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రమోషన్ లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.