Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది సమంత (Samantha ). హీరోయిన్గా ఆకట్టుకోవడమే కాకుండా యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ.. ఎలాంటి పాత్రలోనైనా సరే లీనం కాగలదు అని నిరూపించుకుంది. అలాంటి ఈమె సినిమా పరంగా ఉన్నత శిఖరాలను చేరుకున్నా.. వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా నాగచైతన్యను ప్రేమించే పెళ్లి చేసుకున్న ఈమె.. పెళ్లయిన నాలుగేళ్లకే విడిపోయింది. ఆ తర్వాత తండ్రిని కోల్పోయింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడింది. అయితే ఆ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj nidimoru) ఆమె జీవితంలోకి అడుగు పెట్టారు.
ఇద్దరి మధ్య పరిచయం, స్నేహంగా మారి , ఆ తర్వాత ప్రేమగా మారింది. గత ఏడాది డిసెంబర్ లో లింగ భైరవి ఆలయంలో ప్రత్యేక పద్ధతిలో సమంత, రాజ్ వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత మళ్లీ సినిమాలలో బిజీ అయిపోయింది. స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది సమంత. అలాంటి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బేబీ బంప్ తో కనిపించడంతో ఈమె ప్రెగ్నెంట్ అని అభిమానులు కూడా కామెంట్ చేశారు . ఇక సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది . మెటర్నటీ లీవ్ ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది సమంత. ఇక అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేస్తూ వచ్చిన ఈమె శ్రీ విద్య సాంప్రదాయం పద్ధతిలో శ్రీ చక్రం మధ్యలో కూర్చొని.. మంత్రోచ్ఛారణతో కుటుంబ సభ్యుల మధ్య సీమంతం వేడుకలను జరుపుకుంది .
పూజ అనంతరం మళ్లీ తన పనిలో తాను బిజీ అయిపోయిన ఈమె ఇప్పుడు మరోసారి తొమ్మిది నెలలు కావడంతో అత్తగారి కుటుంబ సభ్యుల సమక్షంలో సీమంతం వేడుకలను జరుపుకుంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది సమంత. అందులో పూజకు సంబంధించిన ఫోటోలు కూడా ఉండడం గమనార్హం. కలశం ముందు కూర్చున్న ఫోటోలు అలాగే పెద్దలు తనను తన బిడ్డను అక్షింతలతో ఆశీర్వదిస్తున్న ఫోటోలను , తన భర్తతో గడిపిన క్షణాలను అన్నింటినీ కూడా సమంతా షేర్ చేసింది. మొత్తానికైతే డెలివరీ కి దగ్గర పడుతున్న సమయంలో మరోసారి సీమంతం వేడుకలతో మళ్ళీ వార్తల్లో నిలిచింది సమంత.
also read:హౌస్ లోకి మాస్క్ మ్యాన్.. భయంతో పరిగెత్తిన ముఖేష్.. కట్ చేస్తే!
సమంత కెరియర్ విషయానికొస్తే.. ఒకవైపు రాబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూనే.. మరొకవైపు సోనీ లివ్ ఓటిటి ప్లాట్ఫామ్ కోసం సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ షోకి సెలబ్రిటీ జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది సమంత.