Samantha: సమంత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈమె ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారు. తన వ్యక్తిగత విషయాల వల్ల సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చిన సమంత తిరిగి మా ఇంటి బంగారం అనే సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా వందకోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిన సమంత (Samantha) మరోసారి ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె త్వరలోనే తల్లి కాబోతున్న నేపథ్యంలో చిన్నవిరామం తీసుకున్నారు. ఇదిలా ఉండగా సమంత డెలివరీ(Samantha Delivary) డేట్ దగ్గర ఉందని చెప్పాలి.
సమంత ప్రెగ్నెన్సీ గురించి నిత్యం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియచేస్తూ వచ్చారు. తాజాగా సమంత తన డెలివరీ గురించి ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీలో భాగంగా సమంత ఒక రీల్ వీడియో షేర్ చేస్తూ.. ఈ వీక్ మీ ప్లాన్ ఏంటి అంటూ ప్రశ్న వేయగా మండే నుంచి సండే వరకు ఏ రోజైనా తాను బిడ్డకు జన్మనివ్వచ్చు అంటూ ఉన్న ఒక రీల్ ఈమె షేర్ చేశారు. ఇలా ఏ క్షణమైనా తాను బిడ్డకు జన్మనివ్వచ్చు అనే విషయాన్ని సమంత ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నాం సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సమంత డెలివరీ కోసం ఇప్పటికే సిద్ధంగా ఉన్నానని అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను అంటూ ఇటీవల అభిమానులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఇక సమంత కొద్ది రోజులలోనే డెలివరీ అవుతున్న నేపథ్యంలో నేడు తన అత్తగారింట్లో ఈమెకు ఘనంగా సాంప్రదాయ బద్ధంగా సీమంతపు వేడుకలను(Baby Shower) జరిపిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సమంత అమ్మతోపాటు తన అత్తమామలు ఆడపడుచు సమక్షంలో ఈ వేడుక చాలా ఘనంగా జరిగిందని తెలుస్తోంది.
ఇకపోతే ఇదివరకే సమంతకు ఈషా ఫౌండేషన్ లో సీమంతపు వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుక పట్ల అప్పట్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో మరోసారి ఈమెకు ఈ వేడుకను నిర్వహించారు. ఇక సమంత ప్రెగ్నెన్సీ దశ చివరికి చేరుకోవడంతో బుల్లి సామ్ లేదా బుల్లి రాజ్ కోసం అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈగర్ గా వైట్ చేస్తున్నారు. ఇక సమంత గత ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లయిన వెంటనే సమంత తల్లి కాబోతున్న శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్నారు.
Also Read: కుర్ర హీరోయిన్ నవ్వుకు ఫిదా అయిన చిరంజీవి!